Coronavirus Telugu, Fake News, Telugu
 

రాహుల్ గాంధీ తన ట్వీట్ లో ఇప్పటివరకు రెండు డోసులు తీసుకున్న 1.4% జనాభా గురించి పేర్కొన్నాడు, కేవలం మొదటి డోస్ తీసుకున్న వారి గురించి కాదు

0

ఒక సోషల్ మీడియా పోస్ట్ కోవిడ్-19 వాక్సినేషన్ కు సంబంధించి ఎక్కువగా షేర్ చేస్తున్నారు. అందులో రాహుల్ గాంధీ తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 10% పైగా భారత జనాభాకు వాక్సినేషన్ అందిన దగ్గర 1.4% అని చూపిస్తున్నారని షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూదాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: దేశంలో 10% పైగా జనాభా కోవిడ్-19వాక్సిన్ తీసుకుంటే, 1.4% జనాభా మాత్రమే వాక్సిన్ తీసుకున్నట్టు రాహుల్ గాంధీ చేసిన తప్పుడు ట్వీట్.

ఫాక్ట్: పూర్తి వాక్సినేషన్ అనేది ఒక మనిషి రెండు డోస్ లు తీసుకున్న తరువాతే సాధ్యం అవుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారంగానే సుమారు 12 కోట్లమందికి మొదటి డోస్, సుమారు 2 కోట్లమందికి రెండవ డోస్ అందింది. అంటే పూర్తిగా వాక్సినేషన్ అయినవారు సుమారు 2 కోట్లు (సుమారు 1.5% భారత దేశ జనాభా). రాహుల్ గాంధీ తన ట్వీట్ లో 1.4% జనాభాకు పూర్తి వాక్సినేషన్ అయిన్నట్టు పేర్కొన్నాడు, కేవలం మొదటి డోస్ తీసుకున్న సుమారు 10% జనాభా గురించి కాదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఆర్టికల్ రాసే సమయానికి భారత దేశంలో 14 కోట్ల వాక్సినేషన్ డోసేజ్ లు ఇచ్చారు, మొదటి డోస్ సుమారు 12 కోట్ల మందికి ఇచ్చారు, మొత్తం రెండు డోసులు సుమారు 2 కోట్ల మందికి ఇచ్చారు. ఈ లెక్క భారత ప్రభుత్వం కోవిన్ డాష్ బోర్డు లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది.

ఒక మనిషికి పూర్తిగా వాక్సినేషన్ అందాలి అని అంటే, అతను రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలి. రాహుల్ గాంధీ తన పోస్టులో పూర్తి వాక్సినేషన్ (Population fully vaccinated) తీసుకున్నవారి గురించి మాట్లాడుతున్నట్టు పేర్కొన్నాడు, మొత్తం డోస్ ల సంఖ్య గురించి కాదు, కేవలం ఒకే డోస్ తీసుకున్న వాళ్ళ గురుంచి కూడా కాదు.

రాహుల్ గాంధీ ఈ ట్వీట్ 24 ఏప్రిల్ 2021న చేసాడు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు విడుదల చేస్తున్న రోజు వారి బులెటిన్ లో 23 ఏప్రిల్ 2021 వరకు రెండు కోట్లకు పైగా జనాభా (సుమారు 1.5% భారత దేశ జనాభా) వాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టు చూడవొచ్చు.

చివరగా, ఇప్పటివరకు దేశంలో మొత్తం ఇచ్చిన వాక్సిన్ డోసుల సంఖ్య సుమారు 14 కోట్లు. కానీ, పూర్తిగా వాక్సినేషన్ పొందినవారు (రెండు డోసులు తీసుకున్న వారు) సుమారు 2 కోట్లు.

Share.

About Author

Comments are closed.

scroll