ఇటీవలే చనిపోయిన సినిమా నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ పై రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ, సుశాంత్ ని క్రికెటర్ అని అన్నాడని చెప్తూ ఒక ట్వీట్ ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, అది ఒక ఫేక్ ఎడిటెడ్ ట్వీట్ అని FACTLY విశ్లేషణలో తేలింది. ట్విట్టర్ లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ పై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ని చూస్తే, ఆ ట్వీట్ లో తను సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ని క్రికెటర్ అని అనలేదని, తనని ఒక ప్రతిభావంతుడైన నటుడిగా (‘talented actor’) పిలిచినట్టు తెలుస్తుంది. ఒరిజినల్ ట్వీట్ మరియు ఎడిట్ చేసిన ట్వీట్ లో సమయం మరియు మిగిలిన పదాలు ఒకేలా ఉన్నట్టు గమనించవచ్చు. కేవలం, ‘actor’ స్థానంలో, ‘Cricketer’ అని ఎడిట్ చేసి తప్పుగా షేర్ చేస్తున్నారు.
సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ –
1. రాహుల్ గాంధీ ట్వీట్ – https://twitter.com/RahulGandhi/status/1272167327459508224
Did you watch our new video?