ఫేస్బుక్ లో రెండు ఫొటోలతో కూడిన కొలేజ్ ని పెట్టి, నిరసనకారులు నకిలీ గాయాలు ప్రదర్శిస్తూ బాధితులమని సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారని పోస్టు చేస్తున్నారు. అంతేకాదు, అందులోని నిరసనకారులను ట్రోల్ చేస్తూ, ఇప్పటివరకు ఏ డాక్టర్ కూడా చేతులకు దెబ్బ తగిలితే షర్ట్ పై నుండి, కంటికి దెబ్బ తగిలితే హిజాబ్ పై నుండి కట్టు కట్టలేదు అని చెప్తున్నారు. పోస్టులోని ఫోటోల గురించి చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: నిరసనకారులు షర్ట్ పై నుండి మరియు హిజాబ్ పై నుండి కట్లు కట్టుకుని నకిలీ గాయాలు ప్రదర్శిస్తూ బాధితులమని సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారు.
ఫాక్ట్ (నిజం): ఫొటోలోని నిరసనకారులు నకిలీ గాయాలను ప్రదర్శించడంలేదు, వారు నిరసనల సమయంలో కన్ను కోల్పోయిన జామియా విద్యార్థి మిన్హాజుద్దీన్ కి సంఘీభావం తెలుపుతూ కట్లను ధరించారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.
కొలేజ్ లోని పైన ఫోటో మీద ‘జాఫర్ అబ్బాస్’ అనే పేరు ఉండడం చూడవచ్చు. దాంతో, గూగుల్‌లో ఆ వ్యక్తి కోసం వెతికినప్పుడు, సెర్చ్ రిజల్ట్స్ లో అదే పేరుతో ఉన్న భారతీయ జర్నలిస్ట్ యొక్క ట్విట్టర్ ఖాతా లభించింది. పోస్టులో ఉన్న రెండు ఫోటోలను ఆయన చేసిన రెండు ట్వీట్ లలో చూడవచ్చు. కొలేజ్ లోని క్రింది ఫోటోని ఈ ట్వీట్ లో చూడవచ్చు. ‘హిజాబ్ పై నుండి కట్టుకట్టుకున్న నిరసనకారురాలు’ అనే విషయంతో ఆ ఫోటో ట్రోల్ అవడంతో, ఆ ఫోటో గురించి ‘జాఫర్ అబ్బాస్’ కామెంట్ చేసి మరొక ట్వీట్ ని పెట్టారు. ఆ ట్వీట్ లో ఆయన ఈ విధంగా రాశారు- ‘డిసెంబర్ 15 న ఢిల్లీ పోలీసుల అణిచివేతకి కారణంగా కన్ను కోల్పోయిన తోటి విద్యార్థి మిన్హాజుద్దీన్‌కు సంఘీభావం తెలూపుతూ జామియా విద్యార్థులు ఒక కంటికి కట్టు కట్టుకున్నారు’.
అదే వివరణతో ఉన్న మరొక ట్వీట్ లో కొలేజ్ లోని పైన ఫోటోని కూడా చూడవచ్చు. మిన్హాజుద్దీన్ కి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ చదవవచ్చు. ‘ ఒక కంటికి కట్లు కట్టుకుని’ నిరసనకారులు చేసిన ప్రదర్శనల గురించిన వార్తా కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు.
బాధితులలా కట్లు కట్టుకొని నిరసన తెలిపే పద్ధతి కొత్తది కాదు. బాధితులలా దుస్తులు ధరించి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వివిధ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసారు. ఆ నిరసనలకు సంబంధించిన వార్తా కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు.
చివరగా, ఫొటోల్లోని వ్యక్తులు కట్లు కట్టుకుని ‘జామియా ఇస్లామీయ యూనివర్సిటీ’ నిరసనల్లో గాయపడిన వ్యక్తికి సంఘీభావం తెలుపుతున్నారు, నకిలీ గాయాలను ప్రదర్శించడంలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?