షిరిడి సాయి బాబా అసలు ఫోటో అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. ఈ కథనం ద్వారా ఆ ఫొటోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: షిరిడి సాయి బాబా అసలు ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ ఫొటోలో ఉన్నది ప్రముఖ కశ్మీరీ సూఫీ కవి ‘షామ్స్ ఫకీర్’. ఇతను 19వ శతాబ్దంలో శ్రీనగర్ లో జన్మించాడు. అసలు పేరు ముహమ్మద్ సిద్ధిక్ భట్ కాగా అతని కలం పేరైన ‘షామ్స్ ఫకీర్’ పేరుతో ప్రసిద్ధి చెందాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ప్రస్తుతం షేర్ చేస్తున్న ఈ ఫొటోలో ఉన్నది షిరిడి సాయి బాబా కాదు. ఈ ఫోటో కశ్మీర్‌కు చెందిన ప్రముఖ సూఫీ కవి ‘షామ్స్ ఫకీర్’ ది. ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వ్యక్తికి సంబంధించి పలు కథనాలు మాకు కనిపించాయి.
ఈ సమాచారం ప్రకారం ఇతను 19వ శతాబ్దానికి (1843-1901) చెందిన ప్రముఖ కవి. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జన్మించాడు. అసలు పేరు ముహమ్మద్ సిద్ధిక్ భట్ కాగా అతని కలం పేరైన ‘షామ్స్ ఫకీర్’ పేరుతో ప్రసిద్ధి చెందాడు (ఇక్కడ & ఇక్కడ).
షామ్స్ ఫకీర్‌పై పుస్తకాలు ఇక్కడ & ఇక్కడ చూడొచ్చు. ఈ సమాచారాన్ని బట్టి ఈ ఫొటోకు షిరిడి సాయి బాబాకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది. గతంలో కూడా FACTLY షిరిడి సాయికి సంబంధించి పలు ఫోటోలు మరియు ఇతర సమాచారాన్ని ఫాక్ట్-చెక్ చేసింది, ఈ కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
చివరగా, ప్రముఖ కశ్మీరీ సూఫీ కవి ‘షామ్స్ ఫకీర్’ ఫోటోను షిర్డీ సాయి బాబా అసలు ఫోటో అంటూ షేర్ చేస్తున్నారు.