Fake News, Telugu
 

SBI కార్డుని ఎడిట్ చేసి, ‘ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోయే లిక్కర్ కార్డు యొక్క నమూనా’ అంటూ ప్రచరం చేస్తున్నారు

1

ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోయే లిక్కర్ కార్డు యొక్క నమూనా’ అని చెప్తూ ఒక కార్డు ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోయే లిక్కర్ కార్డు యొక్క నమూనా.

ఫాక్ట్ (నిజం): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) బ్యాంకు యొక్క కార్డు ఫోటోని ఎడిట్ చేసి, ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోయే లిక్కర్ కార్డు అంటూ అవాస్తవ ప్రచరం చేస్తున్నారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అలాంటి ఫోటోతో కూడిన ‘Business Today’ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. 2017 లో ‘Business Today’ ప్రచురించిన ఆ ఆర్టికల్ లో అది ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) కార్డు అని చూడవొచ్చు. ఆ కార్డుని ఎడిట్ చేసి, ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోయే లిక్కర్ కార్డు అంటూ అవాస్తవ ప్రచరం చేస్తున్నారు.

అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిక్కర్ కార్డులు ప్రవేశ పెడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ స్టేట్ బెవెరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవ రెడ్డి తెలిపినట్టు సాక్షి దినపత్రిక సోమవారం రోజు (డిసెంబర్ 9, 2019) ప్రచురించింది.

చివరగా, SBI కార్డుని ఎడిట్ చేసి, ‘ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోయే లిక్కర్ కార్డు యొక్క నమూనా’ అంటూ ప్రచరం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll