“హనుమంతుడు దహనం చేసిన లంక”, అని చెప్తూ ఒక ఫొటోతో కూడిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హనుమంతుడు దహనం చేసిన లంక ఫోటో.
ఫాక్ట్: ఫోటోలో ఉన్నది శ్రీలంకకి సంబంధించిన ఫోటో కాదు. అది ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉన్న కొలోసియం యొక్క ఫోటో. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ ప్రదేశానికి సంబంధించిన మరిన్ని ఫోటోలు సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి ఆ ఫోటోలో ఉన్నది ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉన్న కొలోసియం అని తెలిసింది. ఆ కొలోసియంని వివిధ రకాల ప్రదర్శనలకు ఉపయోగించేవారు. ఫొటోలో కనిపిస్తున్నది ఆ కొలోసియం కింద ఉన్న సొరంగాలు. కొలోసియంకి సంబంధించిన గూగుల్ స్ట్రీట్ వ్యూని ఇక్కడ చూడవచ్చు. కాబట్టి, పోస్ట్‌లోని ఫోటోలో ఉన్నది శ్రీలంకకి సంబంధించిన ఫోటో కాదు.
రామాయణానికి సంబంధించిన ప్రదేశాలు అని శ్రీలంక టూరిజం వారు కొన్ని ప్రదేశాల ఫోటోలను వారి వెబ్సైటులో పెట్టారు. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఈ ఫోటోలో ఉన్నది హనుమంతుడు దహనం చేసిన లంక కాదు, రోమ్ నగరంలో ఉన్న కొలోసియం.