Fake News, Telugu
 

ఈజిప్ట్‌లో బయటపడిన సమాధిలోని వాల్ పెయింటింగ్ ఫోటోని షేర్ చేస్తూ హిందూ పురాతన దేవాలయం అని అంటున్నారు

0

పిరమిడ్ల కింద హిందూ పురాతన దేవాలయం కనుగొన్నారంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. పురాతన హిందూ దేవాలయాలను కూల్చేసి వాటిపై పిరమిడ్లను కట్టినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పిరమిడ్ల కింద హిందూ పురాతన దేవాలయం కనుగొన్నారంటూ షేర్ చేస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో ఈజిప్ట్‌ దేశం గిజా నగరంలోని బయటపడిన ఒక సమాధిలో వాల్ పెయింటింగ్ చిత్రాన్ని చూపిస్తుంది. ఈ పెయింటింగ్‌ని 2012లో రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన బృందం కనుగొంది. నైలు నదిలో దక్షిణాన ప్రయాణిస్తున్న పడవలను అలాగే, పర్సెనేబ్ అనే మతాధికారి తన భార్య మరియు కుక్కతో కలిసి ఉన్న చిత్రాలను ఈ పెయింటింగ్ చూపిస్తుంది. గిజా సమాధిలో బయటపడిన ఈ వాల్ పెయింటింగ్‌తో హిందూ దేవాలయాలకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటో యొక్క స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే చిత్రాన్ని షేర్ చేస్తూ ‘లైవ్ సైన్స్’ వెబ్సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఈజిప్ట్‌ దేశం గిజా నగరంలోని ‘ది గ్రేట్ పిరమిడ్’ సమీపంలోని ఒక సమాధిలో 4300 సంవత్సరాల క్రితం నాటి వాల్ పెయింటింగ్‌ను కనుగొన్నారంటూ ఈ ఫోటోని షేర్ చేస్తూ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు.

పర్సెనేబ్ అనే మతాధికారి సమాధిలో నిక్షిప్తమైన ఈ పెయింటింగ్‌ను 2012లో రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌కు చెందిన బృందం వెలికితీసినట్టు తెలిసింది. నైలు నదిలో దక్షిణాన ప్రయాణిస్తున్న పడవలను అలాగే, పర్సెనేబ్ అనే మతాధికారి తన భార్య మరియు కుక్కతో కలిసి ఉన్న చిత్రాలను ఈ పెయింటింగ్ చూపిస్తుంది. ఈ వాల్ పెయింటింగ్‌కు సంబంధించి పబ్లిష్ చేసిన మరికొన్ని ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ పెయింటింగ్ హిందూ దేవాలయాన్ని చూపిస్తున్నట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.  

చివరగా, ఈజిప్ట్‌ దేశంలోని బయటపడిన ఒక సమాధిలో వాల్ పెయింటింగ్ ఫోటోని పిరమిడ్ల కింద హిందూ పురాతన దేవాలయం బయటపడిన చిత్రమంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll