సవరణ (28 జూన్ 2023): చైనా ప్రభుత్వ అధికారిక సమాచారం మరియు గూగుల్ ఎర్త్ దృశ్యాలను జోడిస్తూ ఈ కథనం సవరించబడింది.
పర్వతాలు, నదీ ప్రాంతం మధ్య ఉన్న ఒక రహదారి ఫోటో, జమ్మూ జాతీయ రహదారి 44కి సంబంధించింది అని చెప్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: జమ్మూ జాతీయ రహదారి 44 యొక్క ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ ఫోటో వెస్ట్ చైనాలోని గన్సు ప్రావిన్స్‌లోని వెయువాన్ – వుడు ఎక్స్‌ప్రెస్‌వేది . కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ ఫోటో గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, మేము పోస్టులో షేర్ చేసిన ఫోటో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ మమ్మల్ని కైక్సిన్ గ్లోబల్ జూలై 2022లో ప్రచురించిన ఒక కథనానికి దారితీసింది “హైవే విస్తరణ కోసం చైనా పెద్ద ప్రణాళికలను కలిగి ఉంది,” అనేది ఈ కథనం యొక్క టైటిల్. ఇందులో చైనాలో ఉన్న వివిధ ఎక్స్‌ప్రెస్‌వేల ఫోటోలు ఉన్నాయి, వాటిలో ఒకటి వైరల్ ఫోటో. ఈ కథనం ప్రకారం, ఫోటోలో కనిపిస్తున్న రోడ్డు, వెయువాన్ వుడూ ఎక్స్‌ప్రెస్‌వే, ఇది చైనాలోని G75 Lanhai Expresswayలోని ఒక భాగం.
ఈ ఎక్స్‌ప్రెస్‌వే, చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులో భాగం అని విరిలి అనే వెబ్సైట్ ఒక ఆర్టికల్ ద్వారా పేర్కొంది. ఇది కాకండా, ఈ ఫోటోలో ఉన్నది జాతీయ రహదారి 44 అని రుజువు చేయటానికి ఇంటర్నెట్లో ఎటువంటి విశ్వసనీయ సమాచారం లేదు. పైగా, చైనా ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం, లాంగ్నన్ ప్రాంతంలో ఉన్న ఈ రహదారిని 2020లో ప్రారంభించారు.
చైనాలో ఉన్న లియాంఘేకౌ అనే గ్రామం గుండా వెళ్ళే ఈ రహదారి యొక్క గూగుల్ ఎర్త్ దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, ఒక చైనీస్ ఎక్స్‌ప్రెస్‌వే ఫోటో జమ్మూలో ఉన్న NH 44 అని తప్పుగా షేర్ చేస్తున్నారు