మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన ది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదిక ప్రకారం తెలంగాణలో నిరుద్యోగత 33.9 శాతంగా ఉందని చేప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన ది పీరియాడికల్ లేబర్ ఫోర్స్ నివేదిక ప్రకారం తెలంగాణలో నిరుద్యోగత 33.9 శాతంగా ఉంది.
ఫాక్ట్ (నిజం): MoSPI విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్సు అక్టోబర్- డిసెంబర్ 2019 క్వార్టర్లీ సర్వే ప్రకారం తెలంగాణలో అక్టోబర్- డిసెంబర్ 2019 త్రైమాసికంలో నిరుద్యోగత రేట్ 11.5% గా ఉంది. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం అక్టోబర్-డిసెంబర్ 2018 త్రైమాసికం నుండి అక్టోబర్- డిసెంబర్ 2019 త్రైమాసికం వరకు ఎప్పుడూ కూడా తెలంగాణలో నిరుద్యోగత రేట్ 33.9%గా లేదు. ఐతే ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో జనవరి-మార్చ్ 2019 త్రైమాసికానికిగాను ‘worker population ration (WPR)’ అనగా మొత్తం జనాభాలో పనిచేసివారి శాతం 33.9%గా ఉంది. దీన్నిబట్టి WPR ఘనంకాన్ని తెలంగాణలో నిరుద్యోగత రేట్ గా తప్పుగా అర్ధం చేసుకునట్టు చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
‘Ministry of Statistics and Programme Implementation’ పీరియాడిక్ లేబర్ ఫోర్సు అక్టోబర్- డిసెంబర్ 2020 త్రైమాసికానికి సంబంధించిన సర్వే ద్వారా దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగత, ఉద్యోగత గురించిన సాధారణ సమాచారంతో పాటు కరెంటు వీక్లీ స్టేటస్ సమాచారం విడుదల చేసింది. ఐతే ఈ సర్వే శాంపిల్ చాలా చిన్నది, అక్టోబర్- డిసెంబర్ 2020 క్వార్టర్ మొత్తం దేశంలో 1,79,838 మందిని సర్వే చేసారు.
Worker Population Ratio (WPR): మొత్తం జనాభాలో పనిచేసివారి శాతం, కరెంటు వీక్లీ స్టేటస్ ద్వారా సర్వే నిర్వహించిన తేదికి వారం రోజుల ముందు కనీసం ఒక గంట పని చేసిన వారిని వర్క్ ఫోర్సు కింద పరిగనిస్తారు.
కరెంటు వీక్లీ స్టేటస్ లో వర్కర్స్ ని మూడు భాగాలుగా విభజించారు.
1) స్వయం ఉపాధి పొందుతున్నవారు
2) రెగ్యులర్ వేజ్/ సాలరీడ్ ఎంప్లాయ్
3) సాధారణ లేబర్
కరెంటు వీక్లీ స్టేటస్ ప్రకారం సర్వే నిర్వహించిన తేది నుండి వారం రోజుల ముందు వరకు కనీసం ఒక గంట కూడా పని చేయని వారిని నిరుద్యోగులుగా పరిగనిస్తారు.
ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో అక్టోబర్- డిసెంబర్ 2019 త్రైమాసికంలో నిరుద్యోగత రేట్ 11.5% గా ఉంది. ఇదే త్రైమాసికంలో పురుషులలో నిరుద్యోగత 10.2%గా ఉండగా మహిళల్లో మాత్రం 15.3%గా ఉంది. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం అక్టోబర్-డిసెంబర్ 2018 త్రైమాసికం నుండి అక్టోబర్- డిసెంబర్ 2019 త్రైమాసికం వరకు ఎప్పుడూ కూడా తెలంగాణలో నిరుద్యోగత రేట్ 33.9%గా లేదు. ఈ సర్వే ప్రకారం అక్టోబర్- డిసెంబర్ 2019 త్రైమాసికానికి గాను నిరుద్యోగత రేట్ లో జమ్మూకాశ్మీర్ (15.5%), కేరళ (12.5%), మధ్య ప్రదేశ్ (11.5%) తెలంగాణ కంటే ముందున్నాయి. ఇదే త్రైమాసికంలో భారత దేశంలో నిరుద్యోగత 7.9%గా ఉంది.
ఐతే ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో జనవరి-మార్చ్ 2019 త్రైమాసికానికిగాను ‘worker population ration (WPR)’ అనగా మొత్తం జనాభాలో పనిచేసివారి శాతం 33.9%గా ఉంది. దీన్నిబట్టి WPR గణాంకాన్ని తెలంగాణలో నిరుద్యోగత రేట్ గా తప్పుగా అర్ధం చేసుకునట్టు చెప్పొచ్చు.
చివరగా, పీరియాడిక్ లేబర్ ఫోర్సు సర్వే రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో నిరుద్యోగత రేట్ 33.9% కాదు.