“మనుషులు ఎప్పుడు ఎలా చనిపోతారో తెలియదు. మానవత్వం చాటండి...”, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో వివిధ క్లిప్స్ ఉన్నాయి; వాటిలో వ్యక్తులు స్పృహతప్పి పడిపోతున్నట్టు చూడవచ్చు. దీన్ని మనుషులు ఎప్పుడు ఎలా చనిపోతారో అంటూ, ఈ వీడియోలో వివిధ వ్యక్తులు చనిపోయే దృశ్యాలు ఉన్నాయని అర్థం వచ్చేలా షేర్ చేస్తున్నారు. అయితే, ఆ వ్యక్తులు చనిపోయారనడంలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అనుకోకుండా వ్యక్తులు స్పృహతప్పి పడిపోయి చనిపోతున్న వీడియో.
ఫాక్ట్: వీడియోలో చూపెట్టిన వ్యక్తులందరూ చనిపోయారనడంలో నిజం లేదు. వీడియోలోని క్లిప్స్‌కి సంబంధించి ఎక్కువ నిడివి ఉన్న దృశ్యాలు చూడగా, వాటిలోని చాలా మంది వ్యక్తులు పడిపోయి మళ్ళీ లేచినట్టు తెలిసింది. కొందరు ఊరికే సరదాగా కూడా పడిపోయారు. మిగితా క్లిప్స్‌ని కూడా సరదాగానే ఎప్పటినుండో ఇంటర్నెట్‌లో షేర్ చేస్తున్నారు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని వీడియోలో ఉన్న వివిధ క్లిప్స్ యొక్క స్క్రీన్‌షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, వాటిలో కొన్ని క్లిప్స్‌కి సంబంధించిన ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు సెర్చ్ రిజల్ట్స్‌లో వస్తాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.
క్లిప్ 1:
వీడియోలోని వ్యక్తి పడిపోయిన మాట వాస్తవమే. అయితే, తను తిరిగి లేచినట్టు ఈ యూట్యూబ్ వీడియోలో చూడవొచ్చు.
క్లిప్ 2:
ఈ వీడియో క్లిప్ గురించి ‘డైలీ మెయిల్’ అర్టికల్‌లో చదవొచ్చు. ఆ ఘటన కెనడాలో జరిగిందని, వీడియోలోని వ్యక్తి తిరిగిలేచాడని అర్టికల్‌లో ఉంటుంది.
క్లిప్ 3:
వీడియోలో వరుడు సరదాగా వెనక్కి పడగా, వెనక ఉన్న వారు తనని పైకి తోసినట్టు ‘న్యూస్ పోస్ట్’ అర్టికల్‌లో ఉన్న ఎక్కువ నిడివి గల వీడియోలో చూడవొచ్చు.
క్లిప్ 4:
‘ది సన్’ వెబ్‌సైట్‌లో ఈ వీడియోకి సంబంధించిన ఎక్కువ నిడివి గల వీడియోని చూడవొచ్చు. వీడియోలోని అమ్మాయిలు చనిపోయినట్టు ఎక్కడా కూడా లేదు.
వీడియోలోని ఇతర క్లిప్స్‌కి సంబంధించిన కచ్చితమైన సమాచారం లభించనప్పటికీ, వాటిని కూడా సరదాగానే ఎప్పటినుండో ఇంటర్నెట్‌లో షేర్ చేస్తున్నట్టు తెలిసింది. అలాంటి ఇతర ఫన్నీ వీడియోలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, వీడియోలోని వ్యక్తులందరూ స్పృహతప్పి పడిపోయి చనిపోలేదు. వాళ్ళలోని చాలా మంది వ్యక్తులు పడినా మళ్ళీ లేచారు. మరికొందరు సరదాగా పడినట్టు చేసారు.