Fake News, Telugu
 

పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రను 10వ తరగతి ఇంగ్లీష్ పుస్తకాల్లో కర్ణాటక ప్రభుత్వం ప్రవేశ పెట్టలేదు

0

జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు సినీ నటుడు పవన్ కళ్యాణ్ యొక్క జీవిత చరిత్రను 10వ తరగతి ఇంగ్లీష్ పుస్తకాల్లో కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టింది అని చెప్తూ, ఒక వీడియోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: 10వ తరగతి ఇంగ్లీష్ పుస్తకాల్లో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర ప్రవేశపెట్టిన కర్ణాటక ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రను 10వ తరగతి ఇంగ్లీష్ పుస్తకాల్లో కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. వీడియోలో పవన్ కళ్యాణ్ ఫోటోతో ఉన్న పేజీ ‘రచన సాగర్’ సంస్థ వారి 5వ తరగతి ఇంగ్లీష్ పుస్తకంలోనిది. ఆ పుస్తకంలో కూడా పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రను ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ పేరు కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించబడలేదు. కేవలం, మూవీ మేకింగ్ కి (సినిమా ఎలా తీస్తారు) సంబంధించిన పాఠంలో మూవీ టేక్ కి ఉదాహరణగా పవన్ కళ్యాణ్ మూవీ క్లాప్ పట్టుకొని ఉన్న ఫోటో ఇచ్చారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, కర్ణాటక ప్రభుత్వం10వ తరగతి ఇంగ్లీష్ పుస్తకాల్లో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర ప్రవేశపెట్టినట్టు ఎక్కడా కూడా సమాచారం దొరకలేదు. కర్ణాటక కి సంబంధించిన 10వ తరగతి ఇంగ్లీష్ పుస్తకాల్లో వెతికితే కూడా ఎక్కడా పవన్ కళ్యాణ్ గురించి లేదు.

వీడియోలో పవన్ కళ్యాణ్ ఫోటోతో ఉన్న పేజీని చూడవొచ్చు.  ఆ పేజీలోని పదాలతో గూగుల్ లో వెతకగా, భోపాల్ లోని ఒక స్కూల్ వారు అదే పుస్తకాన్ని వాళ్ళ వెబ్సైటు లో అప్లోడ్ చేసినట్టు తెలిసింది. కాకపోతే ఆ స్కూల్ వెబ్సైటు ఇప్పుడు పని చెయ్యడం లేదు. అందుకే గూగుల్ cache లో ఆ పేజీలో ఉన్న సమాచారం చూస్తే, ఆ పుస్తకం లో ఉన్న చాఫ్టర్ల వివరాలు తెలిసాయి. ఆ వివరాలతో మళ్ళీ గూగుల్ లో వెతికితే హర్యానా లో ఉన్న ఇంకో స్కూల్ వెబ్సైటు లో ఈ పుస్తకం యొక్క పూర్తి వివరాలు పెట్టినట్టు తెలిసింది.

దాని ప్రకారం ఆ పేజీ ‘రచన సాగర్’ సంస్థ వారి ‘Together with Expressions English Multiskill Coursebook’ అనే 5వ తరగతి పుస్తకం లోనిదని తెలిసింది. అయితే, ఆ పుస్తకంలో కూడా పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రను ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ పేరు కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించబడలేదు. కేవలం, మూవీ మేకింగ్ కి (సినిమా ఎలా తీస్తారు) సంబంధించిన పాఠంలో మూవీ టేక్ కి (ముహూర్తం అప్పుడు ఇచ్చే క్లాప్) ఉదాహరణగా పవన్ కళ్యాణ్ మూవీ క్లాప్ పట్టుకొని ఉన్న ఫోటో ఇచ్చారు.

చివరగా, పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రను 10వ తరగతి ఇంగ్లీష్ పుస్తకాల్లో కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. అది ఫేక్ న్యూస్.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll