Fake News, Telugu
 

NPCI దృవీకరించిన మర్చంట్స్ మాత్రమే ఫాస్ట్‌ట్యాగ్ స్కానింగ్ ద్వారా లావాదేవీలు చేయగలుగుతారు; ఈ వీడియోలో చూపిస్తున్నది నిజం కాదు

0

కొత్తగా స్మార్ట్ వాచ్‌ల ద్వారా మన ఫాస్ట్‌ట్యాగ్ ఎకౌంటు నుండి డబ్బులు దోచుకునే స్కామ్ జరుగుతుందని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో ఒక అబ్బాయి కార్ అద్దాలు తుడుస్తున్నట్టు నటిస్తూ ఆ కార్‌పై ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్‌ను తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్‌ సహాయంతో స్కాన్ చేసి ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలో నుండి డబ్బులు దోచుకున్నట్టు చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోలో చెప్తున్నదానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కొత్తగా స్మార్ట్ వాచ్‌ల ద్వారా మన ఫాస్ట్‌ట్యాగ్ ఎకౌంటు నుండి డబ్బులు దోచుకునే స్కామ్ జరుగుతుంది.

ఫాక్ట్ (నిజం): .ఈ వీడియోలో చూపిస్తున్నది నిజం కాదు, ఇది ఒక స్క్రిప్టెడ్ డ్రామా. నిజానికి కేవలం NPCI దృవీకరించిన మర్చంట్స్ మాత్రమే ఫాస్ట్‌ట్యాగ్ స్కానింగ్ ద్వారా లావాదేవీలు చేయగలుగుతారు. వేరే ఇతర అనధికార పరికరాలేవి కూడా స్కానింగ్ ద్వారా డబ్బులు డ్రా చేయలేవు. అలాగే కేవలం ఒక వ్యక్తి మరియు మర్చంట్స్‌ మధ్యే లావాదేవీలు చేయడానికి వీలుంటుంది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి స్కాన్ చేసి డబ్బులు పంపడం అనేది ఉండదు. ఇదే విషయాన్ని  NPCI, పేటీఎం మరియు ఫాస్ట్‌ట్యాగ్ కూడా స్పష్టం చేసాయి. వైరల్ వీడియోలో చూపిస్తున్నది నిజం కాదని కూడా ఈ సంస్థలు స్పష్టం చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

సాధారణంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వద్ద నమోదైన టోల్ ప్లాజా, పార్కింగ్ ప్లాజా, మొదలైన మర్చంట్స్‌కి మాత్రమే ఫాస్ట్‌ట్యాగ్ స్కాన్ చేసి డబ్బులు తీసుకునే అధికారం ఉంటుంది. కేవలం ఒక వ్యక్తి మరియు మర్చంట్స్‌ మధ్యే లావాదేవీలు చేయడానికి వీలుంటుంది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి స్కాన్ చేసి డబ్బులు పంపడం అనేది ఉండదు.

 పైగా NPCI ఈ మర్చంట్స్‌ను జీయో లోకేట్ చేస్తుంది. అంటే టోల్ ప్లాజా, పార్కింగ్ ప్లాజా ఎక్కడైతే (లొకేషన్) లావాదేవీలు చేసేందుకు NPCI అనుమతిస్తుందో, అక్కడే ఈ ఫాస్ట్‌ట్యాగ్ స్కానింగ్ అనేది పనిచేస్తుంది. వేరే ఇతర అనధికార పరికరాలేవి కూడా స్కానింగ్ ద్వారా డబ్బులు డ్రా చేయలేవు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలకు సంబంధించిన టెక్నికల్ అంశాలను ప్రస్తావించడం ద్వారా వైరల్ వీడియోలో చూపిస్తున్నది తప్పని NPCI తెలిపింది.

వైరల్ వీడియోలో చుపిస్తున్నదాన్ని తప్పని చెప్తూ పేటీఎం మరియు ఫాస్ట్‌ట్యాగ్ కూడా ఒక వివరణ జారీ చేసాయి. ఈ వివరణలో పైన తెలిపిన విషయాలనే ప్రస్తావించాయి.

PIB కూడా వైరల్  వీడియోలో చూపిస్తున్నది నిజం కాదని, అనధికార పరికరాల ద్వారా స్కానింగ్ చేసి డబ్బులు డ్రా చేయలేమని స్పష్టం చేసింది.

వైరల్ వీడియో :

ఇకపోతే వైరల్ అయిన వీడియోకు సంబంధించిన సమాచరం కోసం వెతకగా ఇదే వీడియో ‘BakLol’ అనే ఫేస్‌బుక్‌ పేజీలో 24 జూన్ 2022న మొదట షేర్ చేసినట్టు తెలిసింది. ఐతే ఆ తర్వాత ఈ వీడియోను డిలీట్ చేసారు, దీని ఆర్కైవ్ వీడియో ఇక్కడ చూడొచ్చు.

ఈ పేజీలో సాధారణంగా ఎంటర్టైన్మెంట్ కోసం  స్క్రిప్టెడ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వైరల్ వీడియోలో కనిపించిన వ్యక్తులు నటించిన కొన్ని వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, NPCI దృవీకరించిన మర్చంట్స్ మాత్రమే ఫాస్ట్‌ట్యాగ్ స్కానింగ్ ద్వారా లావాదేవీలు చేయగలుగుతారు. ఈ వీడియోలో చూపిస్తున్నది నిజం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll