Fake News, Telugu
 

పాత వీడియోలని చూపిస్తూ ఫ్రాన్స్ కి వ్యతిరేకంగా ముస్లిం ప్రపంచం చేస్తున్న నిరసనలని షేర్ చేస్తున్నారు

0

ఫ్రాన్స్ కి వ్యతిరేకంగా ముస్లిం ప్రపంచం చేస్తున్న నిరసనలు, అంటూ షేర్ చేస్తున్న కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముస్లిం మత ప్రవక్త మొహమ్మద్ పై చేసిన కార్టూన్ బొమ్మలను క్లాసులో చుపించారనే కారణంతో, ఒక టీచర్ ని ముస్లిం మతానికి చెందిన ఒక వ్యక్తి హత్య చేసిన ఘటన ఇటివలే పారిస్ నగరంలో చోటుచేసుకుంది. ఈ నెల మొదట్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌ మాట్లాడుతూ, ‘ఇస్లాం మతం సంక్షోబంలో ఉంది. తాము కార్టూన్లు పబ్లిష్ చేసే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు.’,అని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ముస్లిం దేశాలలో ఫ్రాన్స్ కి వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు మొదలయ్యాయి. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఫ్రాన్స్ కి వ్యతిరేకంగా ముస్లిం ప్రజలు చేస్తున్న ఉద్యమాల వీడియోలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులలో షేర్ చేసిన ఈ వీడియోలు పాతవి. ఈ వీడియోలకి ఇటివల ఫ్రాన్స్ కి వ్యతిరేకంగా ముస్లింలు చేస్తున్న ఉద్యమాలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ తప్పు.

వీడియో-1 (ఆర్కైవ్డ్):

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని ‘VOA’ న్యూస్ ఛానల్ వారు ‘10 నవంబర్ 2019’ నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. పోస్టులోని వీడియోలో కనిపిస్తున్న అదే జెండా మరియు లోగో ఈ వీడియోలో కూడా చూడవచ్చు. ముస్లిం మత ప్రవక్త ముహమ్మద్ పుట్టినరోజు సందర్బంగా యెమెన్ దేశంలో ‘09 నవంబర్ 2019’ నాడు జరిగిన వేడుకలకి సంబంధించిన వీడియో అని వివరణలో తెలిపారు.

ఈ వీడియోని ‘AFPTV’ వారు ‘GETTY IMAGES’ వెబ్సైటులో పోస్ట్ చేస్తూ ఇదే విషయాన్నీ తెలిపారు. కొన్ని లక్షల మంది  యెమెన్ దేశ రాజధాని సన నగరంలో జరిగిన ముస్లిం మత ప్రవక్త ముహమ్మద్ పుట్టినరోజు వేడుకలలో పాల్గోన్నారంటూ ‘UPRISING TODAY’ న్యూస్ వెబ్ సైట్ తమ ఆర్టికల్ లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో ఇటివల ఫ్రాన్స్ కి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు సంబంధించినది కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

వీడియో-2 (ఆర్కైవ్డ్):

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని ‘Ukraine Today’ న్యూస్ ఛానల్ ‘19 జనవరి 2015’ నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన ‘Charlie Hebdo’ అనే వార్తా పత్రిక ముస్లిం మత ప్రవక్త ముహమ్మద్ పై చేసిన కార్టూన్ బొమ్మలని వ్యతిరేకిస్తూ కొన్ని వేలమంది చెచెన్ రాజధాని గ్రోజ్నీ నగరంలో నిరసన తెలిపినట్టు ఈ వీడియోలో తెలిపారు.

‘Russia Today’ న్యూస్ ఛానల్ కూడా ఈ వీడియో చెచెన్ దేశంలో జరిగిన నిరసనకి సంబంధించినదని తెలుపుతూ యూట్యూబ్ లో పోస్ట్ చేసారు. ఈ నిరసనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతూ ‘France24’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్  చేసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని చెప్పవచ్చు.

చివరగా, పాత వీడియోలని చూపిస్తూ ఫ్రాన్స్ కి వ్యతిరేకంగా ముస్లిం ప్రపంచం చేస్తున్న నిరసనలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll