“ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వ వైద్యులు అధిక సంతానం అనర్ధదాయకం అని అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వ వైద్యుల పై అప్పటికే 12 మంది సంతానం కలిగిన నజీర్ అహ్మద్ మీరు ఎవరు మాకు చెప్పడానికి అంటూ వైద్యుల దుర్భాషలాడి వైద్యుల మీద దాడి చేసిన నజీర్ అహ్మద్ కుటుంబ సభ్యులను అతని గ్యాంగ్ స్టార్ లను వెతికి వెతికి వీపు మీద డప్పులు బజాజ్ ఇస్తున్న యూపీ పోలీసులు”, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు . ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అధిక సంతానంపై అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వ వైద్యులపై ముస్లింలు దాడి చేయడంతో వారిని యూపీ పోలీసులు కొడుతున్న వీడియో.
ఫాక్ట్: పోస్ట్‌లో చెప్పిన కథకీ, వీడియోలోని దృశ్యాలకు అసలు సంబంధంలేదు. అది 2020లో కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో తీసిన వీడియో. బరేలీలో (ఉత్తరప్రదేశ్) లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సమయంలో వారిపై దాడి జరగడంతో పోలీసులు అలా దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అలాంటి చాలా వీడియోలు సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి. ‘TIMES NOW’ వారు అలాంటి దృశ్యాలతో ఉన్న ఒక వీడియోని ఏప్రిల్ 2020లో పోస్ట్ చేసి, “కరోనావైరస్ భయం: లాక్‌డౌన్‌ను అమలు చేసినందుకు కొంత మంది బరేలీ పోలీసులపై దాడి చేశారు” (తెలుగు అనువాదం) అని రాసినట్టు చూడవచ్చు.
పోస్ట్‌లో చెప్పిన కథకీ, వీడియోలోని దృశ్యాలకు అసలు సంబంధంలేదు. అది 2020లో కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో తీసిన వీడియో అని చెప్తూ వివిధ వార్తాసంస్థలు పెట్టిన పోస్ట్‌లను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. బరేలీలో (ఉత్తరప్రదేశ్) లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సమయంలో వారిపై దాడి జరగడంతో పోలీసులు అలా దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
చివరగా, సంబంధంలేని పాత వీడియో పెట్టి, వైద్యులపై ముస్లింలు దాడి చేయడంతో వారిని పోలీసులు కొడుతున్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు.