అయోధ్య రామ మందిరం విషయం పై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చాక అయోధ్యలో ఇంకా వేరే చోట్ల హిందువులు సంబరాలు జరుపుకున్నట్టు కొన్ని వీడియోలను ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: సుప్రీం కోర్టు తీర్పు తర్వాత సంబరాలు చేసుకుంటున్న వీడియోలు.
ఫాక్ట్ (నిజం): అయోధ్య తీర్పు వచ్చాక తీసిన వీడియోలు కావు అవి. తీర్పు వచ్చాక కొన్ని రోజుల వరకు అయోధ్యలో ఈ విషయానికి సంబంధించి ఎటువంటి రాలీలు కానీ, ప్రదర్శనలు కానీ నిర్వహించకూడదని అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
అయోధ్య మందిర్-మసీదు విషయం పై సుప్రీమ్ కోర్టు నవంబర్ 9న తీర్పు వెల్లడించింది. పోస్ట్ చేసిన వీడియోలు తీర్పు తర్వాత తీసారో లేదా ముందే తీసారో చూద్దాం.
పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఇదే వీడియో గత సంవత్సరం నుండి యూట్యూబ్ లో ఉన్నట్టు చూడవొచ్చు. కొందరు ఆ వీడియో మహారాష్ట్ర లో చత్రపతి శివాజీ కి సంబంధించిన సంబరాల వీడియో అంటూ జూన్-2018 లోనే షేర్ చేసారు. వీడియోలోని జెండాలను సరిగ్గా గమనిస్తే చత్రపతి శివాజీ ముఖాన్ని చూడవొచ్చు. కావున, పోస్ట్ చేసింది పాత వీడియో.
ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఈ వీడియో కూడా గత సంవత్సరం నుండి యూట్యూబ్ లో ఉన్నట్టు చూడవొచ్చు. కావున ఇది కూడా పాత వీడియో, తీర్పు వచ్చాక తీసిన వీడియో కాదు.
ఈ వీడియో కూడా అయోధ్య విషయం పై సుప్రీమ్ కోర్టు తీర్పు ఇవ్వకముందు నుండే యూట్యూబ్ లో ఉన్నట్టు స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే తెలుస్తుంది.
పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఇదే వీడియోకి సంబంధించిన న్యూస్18 ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ ని న్యూస్18 వారు అక్టోబర్ లోనే ప్రచురించినట్టు చూడవొచ్చు. కావున, ఇది కూడా పాత వీడియోనే.
అంతేకాదు, ఈ తీర్పుకు సంబంధించి అయోధ్యలో కొద్ది రోజుల వరకు ఎలాంటి సంబరాలు కానీ, ప్రదర్శనలు కానీ నిర్వహించకూడదని అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.
చివరగా, పాత వీడియోలు పెట్టి, సుప్రీం కోర్టు అయోధ్య తీర్పు తర్వాత చేసుకున్న సంబరాలుగా షేర్ చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: పాత వీడియోలు పెట్టి, సుప్రీం కోర్టు అయోధ్య తీర్పు తర్వాత చేసుకున్న సంబరాలుగా షేర్ చేస్తున్నార