‘ఈ రోజు ఖమ్మం పట్టణం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీపావళి స్టాల్స్ నిప్పురవ్వలు చెలరేగి తగలబడి పోయినవి’ అంటూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: ఖమ్మంలోని దీపావళి బాణాసంచాల స్టాల్స్ లో భారీ అగ్ని ప్రమాదం.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వీడియో 2016 లో ఔరంగాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదం కి సంబంధించిన వీడియో. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, ప్రముఖ వార్తసంస్థలు [హెచ్ఎంటీవీ (ఆర్కైవ్డ్), నమస్తే తెలంగాణ (ఆర్కైవ్డ్), వార్త (ఆర్కైవ్డ్) మరియు వన్ ఇండియా తెలుగు (ఆర్కైవ్డ్)] కూడా అదే వీడియో మరియు ఫోటోలు పెట్టి ‘ఖమ్మంలో భారీ అగ్ని ప్రమాదం’ అని ఆర్టికల్స్ రాసినట్టు చూడవొచ్చు.
కానీ, కొందరు మాత్రం ఫేస్బుక్ లో ఇది ఒక పాత వీడియో అని, ఇలాంటి సంఘటన ఖమ్మంలో జరగలేదని కామెంట్స్ పెడుతున్నారు. కొందరేమో వీడియోలోని ఘటన 2016 లో ఔరంగాబాద్ లో జరిగినట్టు ఫేస్బుక్ లో పెడుతున్నారు. ‘ANI’ వార్తాసంస్థ కూడా ముందు ఈ వీడియో లోని ఘటన ఖమ్మంలో జరిగినట్టు తమ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టింది, కానీ తర్వాత అది ఒక పాత వీడియో అని ట్వీట్ చేసింది.
RETRACTION: Upon further review, this video was an old story which was played out yesterday, therefore we retract it. ANI apologises for this error. https://t.co/mZqvgctpaU pic.twitter.com/HoauoZc5vk
— ANI (@ANI) October 28, 2019
కావున, గూగుల్ లో ‘Aurangabad 2016 fire crackers accident’ అని వెతకగా, 2016 లో జరిగిన సంఘటనకి సంబంధించిన చాలా వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. అందులో తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా ఉంటుంది. ‘Mango News’ వారు యూట్యూబ్ లో ఇదే వీడియోని 2016 లోనే ఔరంగాబాద్ లో జరిగిన సంఘటనగా పోస్ట్ చేసినట్టు చూడవొచ్చు. ఈ ఘటనకి సంబంధించి అప్పట్లో వివిధ వార్తాపత్రికలు ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.
Factly సంస్థ ఖమ్మం పోలీసులను సంప్రదించినప్పుడు, ఇటువంటి సంఘటన ఖమ్మం లో జరగలేదని, వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని తెలిపారు.
చివరగా, 2016 లో ఔరంగాబాద్ లో జరిగిన ఘటన వీడియో పెట్టి, ‘ఖమ్మంలో అగ్ని ప్రమాదం’ అని ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?