Fake News, Telugu
 

పాత వీడియో పెట్టి జార్ఖండ్ లో పండ్ల వ్యాపారులు పెట్టిన కాషాయ జండాలను తొలగిస్తే ప్రజలు తమ ఇళ్లపై కాషాయ జెండాలు పెట్టారని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

జార్ఖండ్ రాష్ట్రం లో పండ్ల వ్యాపారులు తమ బండ్ల పై కాషాయ జండా పెట్టినందుకు పోలీసులు వారి పై కేసు నమోదు చేసారని, కావున ఆ రాష్ట్ర రాజధాని అయిన జంషెడ్పూర్ లో ఆ పండ్ల వ్యాపారులకు సంఘీభావం తెలుపుతూ ప్రతీ ఇంటి పై కాషాయ జండా పెట్టారని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు . ఆ క్లెయిమ్ లో ఎంత నిజం ఉందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జార్ఖండ్ రాష్ట్రం లో పండ్ల వ్యాపారులు కాషాయ జండా పెట్టినందుకు పోలీసులు కేసు నమోదు చేసారని జంషెడ్పూర్ వాసులు ఆ వ్యాపారులకు సంఘీభావం తెలుపుతూ తమ ఇళ్లపై కాషాయ జండాలు పెట్టారు.

ఫాక్ట్ (నిజం): కొన్ని పండ్ల దుకాణాల ముందు పెట్టిన ‘హిందూ ఫల్ దుకాణ్’ బ్యానర్లని జంషెడ్పూర్ పోలీసులు 25 ఏప్రిల్ 2020న తొలగించారు. కానీ, పోస్ట్ లో పెట్టిన వీడియో ఇంటర్నెట్ లో 02 ఏప్రిల్ 2020 నుండి ఉంది. కావున, పోలీసులు బ్యానర్లని ని తీసే ముందే ఈ వీడియో పెట్టారు. అంతేకాక, ఈ వీడియో జంషెడ్పూర్ కి సంబంధించింది కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

జంషెడ్పూర్ పోలీసులు పండ్ల వ్యాపారులు పెట్టిన కాషాయ జండాను తొలగించారు అనే వార్త గురించి ఇంటర్నెట్ లో వెతికితే, కొన్ని పండ్ల దుకాణాల ముందు పెట్టిన ‘హిందూ ఫల్ దుకాణ్’ బ్యానర్లని పోలీసులు 25 ఏప్రిల్ 2020న తొలగించారు అని తెలిసింది. ఆ సంఘటన గురించి జంషెడ్పూర్ పోలీసులు చేసిన ట్వీట్ ని ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ ని కూడా ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు.

పోస్ట్ చేసిన వీడియో లో తొమ్మిది సెకండ్ల దగ్గర లైట్ హౌస్ లా ఉన్న ఒక కట్టడాన్ని గమనించవచ్చు. కానీ, జంషెడ్పూర్ దగ్గర సముద్ర తీరం లేదు (జార్ఖండ్ రాష్ట్రానికి కూడా తీరం లేదు). కావున, ఆ వీడియో గురించి, ఇంకొంచెం వెతికితే, TikTok లో పోస్ట్ చేసిన అదే వీడియో (ఆర్కైవ్డ్) కనిపించింది. ఆ వీడియోలో, TikTok యూసర్ నేమ్ ని (@ mitest.makwana.hindu) చూడవచ్చు.

ఆ యూసర్ నేమ్ తో అతని TikTok అకౌంట్ లో వెతికితే ఆ వీడియోని  (ఆర్కైవ్డ్) అతడు 2 ఏప్రిల్ 2020న అప్లోడ్ చేసాడు అని తెలిసింది. కావున, ఆ వీడియోని  పోలీసులు పండ్ల దుకాణాల దగ్గర బ్యానర్లని ని తీసిన తర్వాత అప్లోడ్ చేయలేదని అర్థం అవుతుంది.

అతని TikTok అకౌంట్ లో, ఇలానే కాషాయ జెండాలతో ఉన్న ఇతర వీడియోలు చాలా చూడవచ్చు. అందులోని  వీడియోలను తన ఊరు, నవ బందర్ లో తీసాడని అతను కొన్ని వీడియోలలో చెప్పాడు. నవ బందర్, గుజరాత్ లోని  సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ఒక గ్రామం. పోస్ట్ చేసిన వీడియోలో ఉన్నటువంటి  లైట్ హౌస్ అతని ఇతర వీడియో లో కూడా చూడవచ్చు. అలాగే, నవ బందర్ గ్రామంలో లైట్ హౌస్ ఉండడం కూడా మ్యాప్ లో చూడవచ్చు

చివరగా, సంబంధం లేని ఒక పాత వీడియోను పెట్టి జంషెడ్పూర్ పోలీసులు కాషాయ జండాను తొలగించారని అక్కడి జనాలు తమ ఇళ్లపై కాషాయ జండాలు పెట్టారని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll