ఫేస్బుక్ లో ఒక వీడియో ని పెట్టి, ‘దయచేసి వినండి జస్టిస్ శ్రీకృష్ణ ఏమి చెపుతున్నారో.. ఎవరు అయితే #థిస (దిశ) విషయం లో సైబరాబాద్ పోలీసులు చేసినది తప్పు అంటున్నారో వాళ్ళకి చెప్పండి’ అని పోస్టు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు ‘దిశ’ నిందితులను ఎన్కౌంటర్ చేయడానికి దారి తీసిన పరిస్థితుల గురించి మరియు న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ ఆ వీడియో లోని వ్యక్తి మాట్లాడుతాడు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.
క్లెయిమ్: న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ మాట్లాడుతున్న జస్టిస్ శ్రీ కృష్ణ వీడియో.
ఫాక్ట్ (నిజం): వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి జస్టిస్ శ్రీ కృష్ణ కాదు, అతను సురేష్ కొచత్తిల్. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులోని వీడియో లో కనిపిస్తున్న వ్యక్తి జస్టిస్ శ్రీ కృష్ణ కాదు, అతను సురేష్ కొచత్తిల్. సురేష్ గత సంవత్సరం కేరళలో వరదలు వచ్చిన సందర్భంలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయినప్పుడు వెలుగులోకి వచ్చాడు. అతని ఫేస్బుక్ అకౌంట్ ప్రొఫైల్ లో తాను బీజేపీ సోషల్ మీడియా సభ్యుడిగా రాసుకున్నట్లుగా ఉంది.
పోస్టులో ఉన్న వీడియోని సురేష్ ఫేస్బుక్ మరియు ట్విట్టర్ అకౌంట్ లలో చూడవచ్చు.
చివరగా, వీడియోలో న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ మాట్లాడింది జస్టిస్ శ్రీ కృష్ణ కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: వీడియోలో న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ మాట్లాడింది జస్టిస్ శ్రీ కృష్ణ కాదు - Fact Checking Tools | Factbase.us