కమ్యూనిస్ట్ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం తరువాత, “ఏచూరి నిజానికి క్రైస్తవుడని, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు జరిగాయి” అని పేర్కొంటూ ప్రజలు ఆయనకు నివాళులర్పిస్తున్న చిత్రం ఒకటి ఇంటర్నెట్‌లో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. దీని వెనుక ఉన్న నిజం ఎంటో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: సీతారాం ఏచూరి క్రైస్తవుడు, ఎందుకంటే అతని అంత్యక్రియలు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగాయి.
ఫాక్ట్(నిజం): సీతారాం ఏచూరికి ఎటువంటి అంత్యక్రియలు లేదా మతపరమైన వేడుకలు నిర్వహించలేదు. యేచూరి మృతదేహాన్ని దహనం చేయకుండా, చెక్క పెట్టెలో పెట్టడంతో అంత్యక్రియలు క్రైస్తవ పద్దతిలో జరిగాయి అని షేర్ చేస్తున్నారు. నిజానికి, వైద్య పరిశోధనల కోసం ఏచూరి మృతదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు విరాళంగా అందించారు, అందుకే దేహాన్ని ఎంబామ్ చేసి శవపేటికలో ఉంచారు. పైగా, ఏచూరి తాను నాస్తికుడినని గతంలో చాలాసార్లు చెప్పారు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ 12 సెప్టెంబర్ 2024 మధ్యాహ్నం మరణించారు. 13 సెప్టెంబరు 2024 ఆయన భౌతికకాయాన్ని తన నివాసానికి తీసుకెళ్లే ముందు, అతని మొదటి రాజకీయ కేంద్రమైన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లారు. 14 సెప్టెంబర్ 2024 ఢిల్లీలోని ఏకేజీ భవన్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆయన భౌతికకాయాన్ని తీసుకొచ్చారు (ఇక్కడ మరియు ఇక్కడ).
వైరల్ పోస్టులో ఉన్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి ఇంటర్నెట్లో వెతికితే, ఇది JNUSU (జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్) యొక్క X హ్యాండిల్‌లో ప్రచురించబడింది అని తెలుసుకున్నాం. ఇది JNU విద్యార్థులు దివంగత నేతకు నివాళులు అర్పిస్తున్న దృశ్యాలలో ఒక ఫోటో. 13 సెప్టెంబర్ 2024న “కామ్రేడ్ సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని JNUSU కార్యాలయంలో నివాళులు అర్పించడం కోసం ఉంచుతారు” అనే పోస్టర్‌ను కూడా షేర్ చేసింది.
ఏచూరి మతం గురించి వెతికితే, యేచూరి చాలా సందర్భాలలో తాను నాస్తికుడని తెలిపారు. పార్లమెంటులో ఒక ప్రసంగంలో, “నేను మద్రాసు జనరల్ హాస్పిటల్‌లో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. నిజాం పాలనలో హైదరాబాద్‌లో ఇస్లామిక్ సంస్కృతిలో నా పాఠశాల విద్యాభ్యాసం సాగిందని ఆయన తెలిపారు. చిస్తీ అనే ఇంటిపేరుతో ఇస్లామిక్ క్రమంలో సూఫీ మహిళను తాను వివాహం చేసుకున్నాను అలాంటప్పుడు నా కొడుకు ఏమని పిలవబడతాడు? బ్రాహ్మణుడా, అతను ముస్లిమా, హిందువా, అతను ఏమిటి?”, అని ప్రశ్నించారు. 2016లో హిందుస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను నాస్తికుడిని అని పేర్కొన్నాడు.
ది హిందూ ఆర్టికల్ “ఏచూరి, అతని శరీరాన్ని AIIMSలో వైద్య పరిశోధన కోసం దానం చేసినందుకు, అతనికి అంత్యక్రియలు జరిపించలేదు” అని తెలిపింది. ఏచూరి స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనకు వీడ్కోలు పలికిన తర్వాత ఆయన భౌతికకాయాన్ని వైద్య విద్య నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు అప్పగించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఆసుపత్రులు మరియు వైద్య కళాశాలలు పరిశోధన మరియు విద్య కోసం దానం చేయబడిన శరీరాలను ఉపయోగిస్తాయి. అవి పరిశోధకులకు సైన్స్‌ను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి.
అంత్యక్రియల సమయంలో, యేచూరి మృతదేహం ఒక చెక్క పెట్టెలో భద్రపరచబడిన కారణంగా ఏచూరి క్రిస్టియన్ అయినందున హిందూ అంత్యక్రియలను అనుసరించి దహనం చేయకుండా శవపేటికలో ఉంచారు అని పోస్టు చేస్తున్నారు. ఏచూరి అంత్యక్రియలను డాక్యుమెంట్ చేసిన వీడియోలు ఏవీ క్రైస్తవ అంత్యక్రియలు నిర్వహించినట్లు సూచించలేదు (ఇక్కడ మరియు ఇక్కడ). బుద్ధదేవ్ భట్టాచార్జీ, జ్యోతి బసు, సోమనాథ్ ఛటర్జీ తమ శరీరాలను దానం చేసిన కొందరు నాయకులు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).
చివరిగా, సీతారాం ఏచూరి మృతదేహం వైద్య పరిశోధన కోసం దానం చేయబడినందున అతనికి ఎటువంటి అంత్యక్రియలు నిర్వహించలేదు.