Fake News, Telugu
 

భారతదేశ అభివృద్ధిని వివరిస్తూ ఏ అమెరికన్ మీడియా సంస్థ ఈ వీడియోను ప్రసారం చేయలేదు; ఈ వీడియోను భారతదేశానికి చెందిన ఒక యూట్యూబ్ ఛానెల్ రూపొందించింది

0

“గత 10 ఏళ్లలో భారతదేశం సాధించిన ప్రగతిని వివరిస్తూ US TV ఛానెల్ విడుదల చేసిన వీడియో” అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) . ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటిదే మరో పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గత 10 ఏళ్లలో భారతదేశం సాధించిన ప్రగతిని వివరిస్తూ ఒక US TV ఛానెల్ విడుదల చేసిన వీడియో.

ఫాక్ట్(నిజం): గత 10 ఏళ్లలో భారతదేశం సాధించిన అభివృద్ధిని వివరిస్తూ ఏ అమెరికన్ మీడియా సంస్థ ఈ వీడియోను ప్రసారం చేయలేదు. ఈ వీడియోను ‘World In Details’ అనే యూట్యూబ్ ఛానెల్ 23 ఫిబ్రవరి 2024న పబ్లిష్ చేసింది. ఈ ఛానల్ యొక్క వివరణ(About) ప్రకారం, ఈ యూట్యూబ్ ఛానల్ భారతదేశానికి చెందింది. ఈ యూట్యూబ్ ఛానల్ అంతర్జాతీయ మీడియా లేదా US (అమెరికా) మీడియా సంస్థలతో సంబంధం కలిగి ఉందని ఛానల్ యొక్క వివరణలో ఎక్కడా పేర్కొనబడలేదు. అలాగే, ఈ వీడియో ఏదైనా అంతర్జాతీయ మీడియా సంస్థ లేదా అమెరికా మీడియా సంస్థ నుండి సేకరించబడిందని కూడా ఎక్కడా పేర్కొనలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది ‘తప్పు’.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను ‘World In Details (వరల్డ్ ఇన్ డిటైల్స్)’ అనే యూట్యూబ్ ఛానల్ 23 ఫిబ్రవరి 2024న పబ్లిష్ చేసినట్లు తెలిసింది. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, భారతదేశంలో పర్యాటకం, పెట్టుబడులను పెంపొందించే లక్ష్యంతో భారతదేశం యొక్క ఆధునిక, అందమైన దృశ్యాలను ప్రపంచానికి చూపించడానికి ఈ వీడియో రూపొందించబడింది. ఈ వీడియోలో ఉపయోగించిన వీడియో క్లిప్‌లు మరియు ఫోటోలు ఈ వీడియో యొక్క రూపకర్తకు చెందినవి కావని ఈ వీడియో వివరణలో స్పష్టంగా పేర్కొనబడింది.  

అంతేకాదు, ఈ ఛానల్ యొక్క వివరణ(About) ప్రకారం, ఈ యూట్యూబ్ ఛానల్ భారతదేశానికి చెందినది అని తెలుస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్ అంతర్జాతీయ మీడియా లేదా US(అమెరికా) మీడియా సంస్థలతో సంబంధం కలిగి ఉందని ఎక్కడా పేర్కొన్నలేదు. అలాగే, ఈ వీడియో ఏదైనా అంతర్జాతీయ మీడియా సంస్థ లేదా అమెరికా మీడియా సంస్థల నుండి సేకరించబడిందని కూడా ఎక్కడా పేర్కొనబడలేదు.

తదుపరి ఈ వీడియోను ఏదైనా US మీడియా సంస్థ కూడా పబ్లిష్ చేసిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఎటువంటి రిపోర్ట్స్ లభించలేదు. భారతదేశం యొక్క ఆర్థిక పురోగతిపై పలు అంతర్జాతీయ మీడియా సంస్థల ఇటీవల పబ్లిష్ చేసిన కథనాలను ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. అలాగే US(అమెరికా)కు చెందిన బ్లూంబర్గ్(Bloomberg) పబ్లిష్ చేసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.    

చివరగా, గత 10 ఏళ్లలో భారతదేశం సాధించిన అభివృద్ధిని వివరిస్తూ ఏ అమెరికన్ మీడియా సంస్థ ఈ వీడియోను ప్రసారం చేయలేదు; ఈ వీడియోను భారతదేశానికి చెందిన ఒక యూట్యూబ్ ఛానెల్ రూపొందించింది. 

Share.

About Author

Comments are closed.

scroll