Fake News, Telugu
 

నిర్భయ హెల్ప్ లైన్ ‘9833312222’ – సేవలను 2018 లో నిలిపివేశారు

2

మహిళలు రక్షణ కోసం నిర్భయ హెల్ప్ లైన్ నెంబర్ – ‘9833312222’ ని సంప్రదించాలంటూ ఫేస్బుక్ లో చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టుల్లో చెప్పిన విషయం ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అత్యవసర పరిస్థితుల్లో మహిళలు తమ రక్షణ కోసం సంప్రదించాల్సిన నిర్భయ హెల్ప్ లైన్ నెంబర్ – ‘9833312222’.

ఫాక్ట్ (నిజం): నిర్భయ హెల్ప్ లైన్ నెంబర్ – ‘9833312222’ ని 2015లో ముంబై రైల్వే పోలీస్ వారు నగరంలోని రైల్ లలో ప్రయాణించే మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేశారు. కానీ, దాని సేవలను 2018 లో నిలిపివేశారు. కావున, పోస్టు లో చెప్పింది తప్పు.

అత్యవసర పరిస్థితుల్లో మహిళలు తమ రక్షణ కోసం సంప్రదించాల్సిన నిర్భయ హెల్ప్ లైన్ నెంబర్ – ‘9833312222’ అని పోస్టుల్లో చెప్పారు. దాని గురించి సమాచారం కోసం గూగుల్ లో ‘nirbhaya helpline number 9833312222’ అని వెతికినప్పుడు, చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. అందులోని ఒక లింక్ లో, హెల్ప్ లైన్ నెంబర్ ‘9833312222’ ని ముంబై మహిళల రక్షణ కోసం ఆ నగర రైల్వే పోలీస్ వారు ఏర్పాటు చేశారని ఉంది. ఆ సమాచారంతో వెతికినప్పుడు, ‘Mumbai Mirror’ వారి కథనం లభించింది. దాని ద్వారా, నిర్భయ హెల్ప్ లైన్ నెంబర్ – ‘9833312222’ ని ముంబై రైల్వే పోలీస్ వారు 2015 లో ఆ నగరంలోని రైల్ లలో ప్రయాణించే మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేశారని తెలిసింది.

ఆ హెల్ప్ లైన్ నెంబర్ ముంబై నగరం లో ఇప్పటికీ అందుబాటులో ఉందా అనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ముంబై రైల్వే పోలీస్ వెబ్సైట్ లింక్ ఒక్కటి సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. కానీ, ఆ లింక్ తెరుచుకోకపోవడంతో, దాని ఆర్చివ్డ్ వెర్షన్ చూసినపుడు, నిర్భయ హెల్ప్ లైన్ నెంబర్ – ‘9833312222’ ని ఫిబ్రవరి 1, 2018 నుండి నిలిపివేస్తున్నట్లుగా అందులో తెలిపినట్లు ఉంది.

చివరగా, హెల్ప్ లైన్ నెంబర్ – ‘9833312222’ ని ముంబై రైల్వే పోలీస్ వారు ఆ నగర మహిళల రక్షణ కోసం 2015 లో మొదలు పెట్టారు. దాని సేవలను 2018 లో నిలిపివేశారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll