Fake News, Telugu
 

నిపా వైరస్ కోళ్ళకు వ్యాపించినట్లు మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ గుర్తించిలేదు. అది ఒక ఫేక్ న్యూస్.

1

నిపా వైరస్ కోళ్ళకు వ్యాపించినట్లు మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ గుర్తించిందని, కొద్ది రోజులు చికెన్ తినవద్దని ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నిపా వైరస్ కోళ్ళకు వ్యాపించినట్లు మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ గుర్తించింది. 

ఫాక్ట్ (నిజం): తాము నిపా పరీక్షలు కోళ్ళ పై నిర్వహించలేదని,కోళ్ళకు నిపా వైరస్ వ్యాపించినట్లు సోషల్ మీడియా లో వస్తున్న పోస్ట్ లలో నిజంలేదని 2018 లోనే మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ వారు వివరణ ఇచ్చారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.  

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘nipah virus in chicken manipal’ అని వెతకగా, ఈ విషయం పై 2018 లోనే ‘The Times of India’ వారు ప్రచురించిన ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. పోస్ట్ లోని విషయాలను మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ వారు ఖండించినట్టు ఆర్టికల్ లో చదవొచ్చు. తాము నిపా పరీక్షలు కోళ్ళ పై నిర్వహించలేదని, కోళ్ళకు నిపా వైరస్ వ్యాపించినట్లు సోషల్ మీడియా లో వస్తున్న పోస్ట్ లలో నిజం లేదని మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ కి చెందిన డాక్టర్ అరుణ్ కుమార్ చెప్పినట్టు తెలుస్తుంది. పోస్ట్ లోని ఫోటో దేనికి సంబంధించిందో ఇంటర్నెట్ లో ఎక్కడా కూడా దొరకలేదు. నిపా వైరస్ పై మరింత సమాచారం కొసం ఇక్కడ చదవొచ్చు.

గత సంవత్సరం కేరళలో నిపా వైరస్ పై ఇలాంటి ఫేక్ న్యూస్ వైరల్ అయినప్పుడు కేరళ పోలీసువారు కొందరిని అరెస్ట్ కూడా చేసినట్టుగా ఇక్కడ చదవొచ్చు.

చివరగా, నిపా వైరస్ కోళ్ళకు వ్యాపించినట్లు మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ గుర్తించిలేదు. అది ఒక ఫేక్ న్యూస్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll