4 మార్చి 2024న ఆదిలాబాద్‌లో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకి చెందిన వీడియో అని చెప్తూ ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ కథనం ద్వారా, ఇందులో ఎంత నిజం ఉందో చూద్దాం.
క్లెయిమ్: 4 మార్చి 2024న జరిగిన నరేంద్ర మోదీ ఆదిలాబాద్ సభకి సంబంధించిన వీడియో ఇది.
ఫ్యాక్ట్(నిజం): వాస్తవానికి ఈ క్లిప్ 2019 నాటిది. 3 ఏప్రిల్ 2019న కోల్‌కతాలో జరిగిన ఒక నరేంద్ర మోదీ ర్యాలీలో చిత్రీకరించిన వీడియో ఇది.కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియోలో చేసిన క్లైయిమ్‌ని ధృవీకరించడానికి, దానిలోని కొన్ని కీ ఫ్రేమ్స్ పైన రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా ఈ వీడియో యొక్క అసలు వెర్షన్ నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్, Narendramodi.in యొక్క అధికారిక ‘X’ హ్యాండిల్లో మాకు దొరికింది.
ఇది 3 ఏప్రిల్ 2019న అప్లోడ్ చేయబడింది, ఈ వీడియో యొక్క శీర్షిక, ఇది కోల్‌కతాలో జరిగిన ర్యాలీకి చెందినదిగా గుర్తిస్తుంది. ఈ విజువల్స్ 2024 మార్చిలో జరిగిన ఆదిలాబాద్ మీటింగ్‌లోవి కావు అని మనకి దీని ద్వారా స్పష్టంగా అర్థం అవుతోంది.
‘భారతీయ జనతా పార్టీ’ అధికారిక యూట్యూబ్ చానల్‌లో ఈ బహిరంగ సభ యొక్క ఫుటేజీని 2019లో అప్లోడ్ చేసారు.
ప్రధాని మోదీ యొక్క ఆదిలాబాద్ సభకి ప్రజల వచ్చిన విషయం వాస్తవమే అయినా, సోషల్ మీడియాలో షేర్ చేయబడుతున్న ఈ వైరల్ వీడియో ఈ మీటింగుకి సంబంధించినది కాదు. ప్రధానమంత్రి ఆదిలాబాద్ పర్యటనకి చెందిన దృశ్యాలను మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో కోల్‌కతాలో 2019లో నరేంద్ర మోదీ ర్యాలీకి సంబంధించినది, ఆదిలాబాద్‌లో ఆయన ఇటీవలి పర్యటనకి సంబంధించినది కాదు.