Fake News, Telugu
 

ముస్లిం మహిళలను చైన్లతో బంధించి తీసుకెళ్తున్న ఈ ఫోటో ఎడిట్ చేయబడినది

0

బురఖా ధరించి ఉన్న ముస్లిం మహిళలని చైన్లతో బంధించి తిసుకెళ్తున్న దృశ్యం, అని సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ముస్లిం మతంలో మహిళలని బానిసలుగా మాత్రమే చూస్తారని చెపుతూ ఈ ఫోటో షేర్చే చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బురఖా ధరించి ఉన్న ముస్లిం మహిళలని చైన్లతో బంధించి తీసుకెళ్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో ఎడిట్ చేయబడినది. ఒరిజినల్ ఫోటోలో ఆ ముస్లిం మహిళల కాళ్ళకి చైన్లు కట్టి లేవు. ఆఫ్ఘానిస్తాన్ దేశంలోని కాబుల్ నగరంలో ఈ ఫోటో తీసినట్టు తెలిసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ దొరికింది. ఈ ఆర్టికల్ షేర్ చేసిన ఫోటోలోముస్లిం మహిళల కాళ్ళకి చైన్లు కట్టి లేవు. ఈ ఫోటోని ఆఫ్ఘానిస్తాన్ దేశం లోని కాబుల్ నగరంలో తీసినట్టు ఆర్టికల్ లో తెలిపారు.

ఈ ఒరిజినల్ ఫోటోని షేర్ చేస్తూ పబ్లిష్ అయిన మరికొన్ని ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఆఫ్ఘానిస్తాన్ దేశంలో ముస్లిం మహిళలు తమ భర్తతో మాత్రమే బయటికి వెళ్తారని తెలుపుతూ ఈ ఫోటోని షేర్ చేసారు. ఆఫ్ఘానిస్తాన్ దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ‘TIME’ 2018లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

పోస్టులో షేర్ చేసిన అదే ఫోటో ‘Imgflip’ అనే ఇమేజ్ క్రియేటింగ్ వెబ్సైటులో దొరికింది. దీనిబట్టి, ఈ ఫోటో ఎడిట్ చేయబడినది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఎడిట్ చేయబడిన ఫోటోని చూపిస్తూ ముస్లిం మహిళలను చైన్లతో బంధించి తీసుకెళ్తున్న దృశ్యమని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll