Fake News, Telugu
 

తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని తీన్మార్ మల్లన్న అన్నట్టు ఫేక్ వార్తా కథనం షేర్ చేస్తున్నారు

0

తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి అక్రమ ఆస్తుల వివరాలతో సీబీఐ మెట్లు ఎక్కుత, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా, వారం రోజులో స్పష్టమయిన హామీ రాకపోతే బీఆర్ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తా అని తీన్మార్ మల్లన్న అన్నాడని ‘శనార్తి తెలంగాణ’ వార్తా కథనం పబ్లిష్ చేసినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్  అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు – ‘శనార్తి తెలంగాణ’ వార్తా పత్రిక కథనం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటోలోని కథనాన్ని ‘శనార్తి తెలంగాణ’ పబ్లిష్ చేయలేదు. సోషల్ మీడియాలో తమ పేరుతో వైరల్ చేస్తున్న ఈ వార్తా కథనం ఫేక్ అని శనార్తి తెలంగాణ ఎడిటర్ తీన్మార్ మల్లన్న ఫేస్‌బుక్ పోస్ట్, యూట్యూబ్ లైవ్ ద్వారా స్పష్టం చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన కథనాన్ని ‘శనార్తి తెలంగాణ’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిందా? లేదా? అని తెలుసుకునేందుకు ‘శనార్తి తెలంగాణ’ వార్తా సంస్థ వెబ్సైటులో వెతికితే, తీన్మార్ మల్లన్నకు సంబంధించి అటువంటి వార్తా కథనమేదీ ‘శనార్తి తెలంగాణ’ వార్తా సంస్థ పబ్లిష్ చేయలేదని తెలిసింది. తనకు ఎమ్మెల్సీ  పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసినట్లుగా ఏ ఒక్క వార్తా సంస్థ ఇప్పటివరకు రిపోర్ట్ చేయలేదు. 16 డిసెంబర్ 2023 న శనార్తి తెలంగాణ ప్రచురించిన అసలు వార్తాపత్రిక ఇక్కడ చూడవచ్చు.

సోషల్ మీడియాలో తమ పేరుతో వైరల్ అవుతున్న ఈ వార్తా కథనానికి సంబంధించి ‘శనార్తి తెలంగాణ’’ సంస్థ స్పష్టతనిచ్చింది. “ఈ వార్త శనార్తి తెలంగాణలో రాలేదు, ఇది ఫేక్ వార్త ,దీనిని నమ్మకండి”, అని ‘శనార్తి తెలంగాణ’ వార్తా సంస్థ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. ఇది తనపై జరిగిన రాజకీయ కుట్ర అని, శనార్తి తెలంగాణ పేపర్ మార్ఫింగ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.

చివరగా, తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని తీన్మార్ మల్లన్న అన్నట్టు ఫేక్ వార్తా కథనం షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll