‘అరబ్’ వారి లాగ మోడీ తలపాగా ధరించినట్లుగా ఉన్న ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ‘దుబాయ్ షేక్ అవతారంలో పీఎం మోడీ’ అని ఆరోపిస్తున్నారు. ఆ ఫోటో ఎంత వరకు వాస్తవమో విశ్లేషిద్దాం.
క్లెయిమ్: దుబాయ్ షేక్ అవతారంలో పీఎం మోడీ ఫోటో.
ఫాక్ట్ (నిజం): మోడీ ‘అరబ్’ వారి లాగ తలపాగా ధరించినట్లుగా ఉన్న ఇమేజ్ ఫోటోషాప్ చేసినది. కావున, పోస్టులోని ఆరోపణ తప్పు.
పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, మోడీ ఇటీవల సౌదీ అరేబియా పర్యటనకి వెళ్లినప్పటి ఫోటోలు సెర్చ్ రిజల్ట్స్ చాలా వచ్చాయి. కానీ, వాటిల్లో మోడీ తన తల పై ‘అరబ్’ వారి లాగ తలపాగా ధరించినట్లుగా ఏ ఫొటోలో కూడా కనిపించలేదు. పోస్టులో పెట్టిన ఇమేజ్ యొక్క వాస్తవ చిత్రాన్ని ‘Economic times’ వారు అక్టోబర్ 30, 2019 న మోడీ సౌదీ అరేబియా పర్యటనకి వెళ్లడం గురించి రాసిన కథనం లో చూడవచ్చు. కావున, పోస్టులో పెట్టినది ఒక ఫోటోషాప్ చేయబడిన ఇమేజ్.
చివరగా, మోడీ ‘అరబ్’ వారి లాగ తలపాగా ధరించినట్లుగా ఉన్న ఇమేజ్ ఫోటోషాప్ చేసినది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: మోడీ ‘అరబ్’ వారి లాగ తలపాగా ధరించినట్లుగా ఉన్న ఇమేజ్ ఫోటోషాప్ చేసినది - Fact Checking Tools | Factbase.us