Fake News, Telugu
 

దగ్గు సిరప్ ను పాలతో కలిపితే విషపూరితం అవ్వదు. అది ఒక ఫేక్ మెసేజ్.

1

దగ్గు సిరప్ ను పాలతో కలిపితే విషపూరితం అవుతుందని చెప్తూ, అలా కలిపి ఇచ్చినందుకు తన నలుగురు పిల్లలిని ఒక తల్లి కోల్పోయింది అని ఉన్న ఒక మెసేజ్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దగ్గు సిరప్ ను పాలతో కలిపితే విషపూరితం అవుతుంది. అలా కలిపి ఇచ్చి, ఒక తల్లి తన నలుగురు పిల్లలను ప్రమాదవశాత్తు చంపింది.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్పిన ఘటన జరిగినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. అంతేకాదు, దగ్గు సిరప్ ను పాలతో కలిపితే విషపూరితం అవ్వదని చాలా మంది డాక్టర్లు చెప్పారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులో చెప్పిన ఘటన గురించి వెతకగా, అలాంటి ఘటన జరిగినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. అయితే, దగ్గు సిరప్ ను పాలతో కలిపితే విషపూరితం అవుతుందా అని కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, అలా కలిపి తాగుతే కొంత మందికి అసౌకర్యంగా ఉండవొచ్చు కానీ విషపూరితం మాత్రం కాదు అని చాలా మంది డాక్టర్లు చెప్పినట్టు ‘Practo’ మరియు ‘Health Tap’ వంటి మెడికల్ వెబ్ సైట్లలో చదవొచ్చు.

దగ్గు సిరప్ ను పాలతో కలిపితే విషపూరితం అవ్వదు, కానీ పాలతో కొన్ని మందులు తీసుకోకపోవడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. పాలతో తీసుకోవడం వల్ల కొన్ని మందుల ప్రభావం తగ్గుతాయని చెప్తున్నారు. అంతేకాదు, అసలు ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ఎక్కువ డోసుల్లో దగ్గు సిరప్ ఇవ్వకపోవడం మంచిదని కొందరు డాక్టర్లు సలహా ఇస్తున్నారు.

చివరగా, దగ్గు సిరప్ ను పాలతో కలిపితే విషపూరితం అవ్వదు. అది ఒక ఫేక్ మెసేజ్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

1 Comment

scroll