
పాదాలు ఉన్న ఒక ఫోటో ని పెట్టి, లాక్ డౌన్ కారణంగా వలస కూలీల కుటుంబాలు తమ సొంత ఊర్లకు నడవడంతో వారి పాదాలకు పుండ్లు ఏర్పడిన ఫోటో అని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ, ఆ ఫోటో పాతది మరియు పాకిస్తాన్ దేశానికి చెందినదని FACTLY విశ్లేషణలో తేలింది. ‘Daily Mail’ వారి 11 జూన్ 2018 కథనం లో ఫోటోలోని పిల్లలు ‘ఎపిడెర్మోలిటిక్ హైపర్కెరాటోసిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది. లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారనేది వాస్తవమే, కానీ ఫోటో ఇప్పటిది కాదు మరియు దానికి భారత దేశంతో సంబంధం లేదు.
సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ – న్యూస్ ఆర్టికల్ – https://www.dailymail.co.uk/health/article-5829255/The-Pakistani-siblings-turned-stone.html
Did you watch our new video?