Fake News, Telugu
 

‘మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హెల్మెట్ అవసరం లేదు’ అని వస్తున్న మెసేజ్ ఫేక్

1

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హెల్మెట్ వాడడం తప్పనిసరి కాదని, అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీని కోర్టు తిరస్కరించిందని చెప్తూ దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాది పేరుతో ఉన్న ఒక మెసేజ్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ మెసేజ్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ (న్యాయవాది): ‘రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీలను కోర్టు తిరస్కరించింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి కాదు.”

ఫాక్ట్ (నిజం): తన పేరుతో వైరల్ అవుతున్న మెసేజ్ లో నిజం లేదని, అది ఒక ఫేక్ మెసేజ్ అని జూన్ నెలలోనే తన ఫేస్బుక్ అకౌంట్ లో ఒక వీడియోని దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ పోస్ట్ చేసాడు. మున్సిపల్ కార్పొరేషన్ లో హెల్మెట్ అవసరం లేదని కోర్టు కూడా తాజాగా ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. అంతేకాదు, తాజాగా అమలు అయిన ‘Motor Vehicles (Amendment) Act 2019’ లో కూడా అటువంటి మినహాయింపు లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో ఇచ్చిన న్యాయవాది గురించి గూగుల్ లో ‘devendra pratap singh chauhan helmet’ అని సెర్చ్ చేయగా, వైరల్ అవుతున్న మెసేజ్ పై న్యాయవాది దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ వివరణ ఇస్తూ పెట్టిన వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వీడియో లో తన పేరు మీద వస్తున్న మెసేజ్ లో నిజం లేదని చెప్పినట్టు చూడవొచ్చు.

తన ఫేస్బుక్ అకౌంట్ లో కూడా వైరల్ అవుతున్న మెసేజ్ పై వివరణ ఇస్తూ జూన్ నెలలోనే పోస్ట్ చేసినట్టు చూడవొచ్చు.

అంతేకాదు, సుప్రీమ్ కోర్టు గాని, వేరే ఇతర కోర్టులు గాని తాజాగా అటువంటి తీర్పు ఇచ్చినట్టుగా కూడా ఎటువంటి సమాచారం లేదు. తాజాగా అమలు అయిన ‘Motor Vehicles (Amendment) Act 2019’ లో సెక్షన్ 129 లో హెల్మెట్ కి సంబంధించి చూడవొచ్చు. దాంట్లో, మునిసిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఎటువంటి మినహాయింపు లేదు.

హెల్మెట్ రూల్స్ ని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అంశంపై వివిధ వార్తాపత్రికలు రాసిన ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ‘మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హెల్మెట్ అవసరం లేదు’ అని న్యాయవాది చౌహాన్ పేరుతో వస్తున్నది ఒక ఫేక్ మెసేజ్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll