Fake News, Telugu
 

అసలు ఫోటోని ఎడిట్ చేసి, మమతా బెనర్జీ ఎడమ కాలికి గాయమైతే కుడి కాలికి పట్టీ కట్టుకున్నట్టు షేర్ చేస్తున్నారు

0

మమతా బెనర్జీ ఎడమ కాలికి గాయమైతే కూడి కాలికి పట్టీ కట్టుకున్న దృశ్యమంటూ సోషల్ మీడియాలో  రెండు ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ షేర్ అవుతుంది. పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ లో జరిగిన ఒక సంఘటనలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనెర్జీ ఎడమ కాలికి గాయమైన విషయం మనందరికీ తెలుసు.  ఈ నేపథ్యంలో షేర్ అవుతున్న ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మమతా బెనెర్జీ ఎడమ కాలికి గాయమైతే, కుడి కాలుకు పట్టీ కట్టుకున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): మమతా బెనర్జీ కుడి కాలికి పట్టీ కట్టుకొని వీల్ చైర్ లో కూర్చున్న ఫోటో అసలు ఫోటో యొక్క రివర్స్ ఇమేజ్ (అద్దంలో కనిపించే ప్రతిబింబం లాంటిది) అని తెలిసింది.  మమతా బెనెర్జీ యొక్క ఒరిజినల్ ఫోటోని ఎడిట్ చేసి ఇలా కుడి కాలికి పట్టీ కట్టుకున్నట్టు షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన మొదటి ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ కొన్ని న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటోని 11 మార్చి 2021 నాడు AITC లీడర్ అభిషేక్ బెనర్జీ తన ట్వీట్ లో షేర్ చేసారు. ఈ ఫోటో మమతా బెనర్జీ హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పుడు తీసిందని మనం చూసి చెప్పవచ్చు. ఒరిజినల్ ఫోటోలో మమతా బెనర్జీ ఎడమ కాలికి మాత్రమే పట్టీ కట్టి ఉంది.

పోస్టులో షేర్ చేసిన రెండో ఫోటో, మమతా బెనర్జీ 12 మార్చి 2021 నాడు SSKM హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు తీసినదని తెలిసింది. పోస్టులో షేర్ చేసిన ఫోటో ఒరిజినల్ ఫోటో యొక్క రివర్స్ ఇమేజ్ (అద్దంలో కనిపించే ప్రతిబింబం లాంటిది) అని తెలిసింది. ‘Banglar Gorbo Mamata’ ట్వీట్ చేసిన ఒరిజినల్ ఫోటోలో మమతా బెనర్జీ ఎడమ కాలికి మాత్రమే పట్టీ కట్టినట్టు కనిపిస్తుంది. ఒరిజినల్ ఫోటోని ఎడిట్ చేసి మమతా బెనర్జీ ఎడమ కాలికి గాయమైతే, కుడి కాలికి పట్టీ కట్టుకున్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు.

‘ANI’ న్యూస్ ఛానల్ పబ్లిష్ చేసిన వీడియోలో కూడా మమతా బెనర్జీ ఎడమ కాలికి మాత్రమే పట్టీ కట్టినట్టు చూపించింది.

చివరగా, అసలు ఫోటో యొక్క రివర్స్ ఇమేజ్ ని చూపిస్తూ మమతా బెనర్జీ ఎడమ కాలికి గాయమైతే కుడి కాలికి పట్టీ కట్టుకున్న దృశ్యమంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll