Fake News, Telugu
 

మద్యం GST చట్టం పరిధిలోకి రాదు; రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం పైన ఎక్సయిజ్ డ్యూటీ లేదా వ్యాట్ విధిస్తాయి

0

‘ఆరోగ్యం చెడగొట్టే లిక్కర్ ..0% GST. ఆరోగ్యం కాపాడుకునే మెడిసిన్స్ పై 12% GST ఇదీ మన దేశ స్థితి’ అని చెప్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: ఆరోగ్యాన్ని కాపాడే మెడిసిన్స్ పైన 12% GST; ఆరోగ్యం చెడగొట్టే లిక్కర్ మీద 0% GST.

ఫ్యాక్ట్ (నిజం):  కేంద్ర ప్రభుత్వం విధించే  గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) నుండి కొన్ని వస్తువులు మరియు సేవలపైన 0% GST ఉంటుంది, కొన్నిటిపైన పన్ను మినహాయింపు ఉంటుంది, మరియు కొన్ని వస్తువులు అసలు GST పరిధిలోకి రావు. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టం ప్రకారం, మనుషుల వినియోగం కొరకు విక్రయించే మద్యం లేదా లిక్కర్ GST పరిధిలోకి రాదు. రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం పైన ఎక్సయిజ్ డ్యూటీ లేదా వ్యాట్ విధిస్తాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) భారతదేశంలో వస్తువులు మరియు సేవల సరఫరా పైన విధించే పన్ను. మెడిసిన్స్ పైన 5%, 12% మరియు 18% రేంజ్ లో GST విధించడం జరుగుతుంది.

GST చట్టం ప్రకారం కొన్ని వస్తువులు మరియు సేవలపైన 0% GST ఉంటుంది, కొన్నిటికి పన్ను మినహాయింపు ఉంటుంది, మరియు కొన్ని వస్తువులు అసలు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ పరిధిలోకి రావు.

 ది సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆక్ట్, 2017 ప్రకారం మనుషుల వినియోగం కొరకు చేయబడ్డ అల్కహిలిక్ లిక్కర్/ మద్యాన్ని సప్లై అఫ్ సర్వీస్ (సేవల సరఫరా) గా పరిగణించరు.

మద్యం సరఫరా GST చట్టం పరిధిలోకి రాకపోయినా కూడా, దేశంలోని రాష్ట్రాలు మద్యం పైన ఎక్సయిజ్ డ్యూటీ లేదా వేల్యూ యాడెడ్ టాక్స్ విధిస్తాయి.

తెలంగాణ ప్రభుత్వం మద్యం పైన విధించే పన్ను వివరాలు ఇక్కడ చూడొచ్చు. దేశంలో ఏ రాష్ట్రాలు మద్యంపైన ఎక్కువ పన్నులు విధిస్తున్నారో తెలుసుకోవటానికి ఈ ఆర్టికల్ చదవండి.

చివరిగా, మద్యం పైన 0% గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) ఉంటుంది అనేది అవాస్తవం, అసలు మద్యం GST చట్టం పరిధిలోకి రాదు.

Share.

About Author

Comments are closed.

scroll