Fake News, Telugu
 

కేరళ ప్రభుత్వం ముఖ్యమంత్రి అధికారిక నివాసం పునరుద్ధరణ కోసం కేటాయించింది 98 లక్షలు, 75 కోట్లు కాదు

0

‘75 కోట్లతో తన అధికారిక నివాసాన్ని ఆధునీకరిస్తున్న కేరళ సిఎం పినరయి’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. పైగా ఈ కాంట్రాక్టు తన అల్లుడి కంపెనీకే అని కూడా పోస్టులో పేర్కొన్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘75 కోట్లతో తన అధికారిక నివాసాన్ని ఆధునీకరిస్తున్న కేరళ సిఎం పినరాయి’.

ఫాక్ట్ (నిజం): కేరళ ప్రభుత్వం ముఖ్యమంత్రి అధికారిక నివాసం పునరుద్ధరణ కోసం కేటాయించింది 98 లక్షలు, 75 కోట్ల రూపాయలు కాదు. ఇదే విషయాన్ని చాలా వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి. పైగా ఈ కాంట్రాక్టు ఉరులుంగల్ సొసైటీకి అప్పగించారు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కేరళ ముఖ్యమంత్రి అధికారిక నివాసం యుక్క ఆధునీకరణకి సంబంధించిన మరింత సమాచారం కోసం గూగుల్ లో వెతకగా ఈ వార్తకి సంబంధించి సమాచరాన్ని ప్రచురించిన కొన్ని కథనాలు మాకు కనిపించాయి. కేరళ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘క్లిఫ్ హౌస్’ పునరుద్ధరణకి సంబంధించి ప్రభుత్వం 98 లక్షల రూపాయాలు కేటాయించినట్టు ఈ కథనాలలో  పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సెక్యూరిటీ గార్డ్లు, డ్రైవర్లు, అతిధుల విశ్రాంతి గదుల పునరుద్ధరణ కూడా చేయాలనీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసారు.

ఐతే పునరుద్ధరణకి సంబంధించిన కాంట్రాక్టుని ఎటువంటి టెండర్లు లేకుండా ఉరులుంగల్ సొసైటీకి బదిలీ చేయాలని పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటు నిర్ణయించిందని ఈ కథనాలలో పేర్కొన్నారు. ఈ వార్తకి సంబంధించిన మరికొన్ని కథనాలు కూడా ఇదే విషయాన్ని ద్రువీకరిస్తున్నాయి, ఈ కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఇకపోతే ఉరులుంగల్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ (ULCCS) లిమిటెడ్ అనేది 1925లో కేరళలో కొందరు సామాజిక సంస్కర్తలు స్థాపించిన ఒక కోఆపరేటివ్ సొసైటీ. ఇకపోతే, ఈ పునరుద్ధరణకి సంబంధించిన కాంట్రాక్టుని పినరయి విజయన్ అల్లుడికి చెందిన కంపెనీకి ఇచ్చారనేది కూడా కల్పిత వార్తే.

చివరగా, కేరళ ప్రభుత్వం ముఖ్యమంత్రి అధికారిక నివాసం పునరుద్ధరణ కోసం కేటాయించింది 98 లక్షలు, 75 కోట్లు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll