తాను బ్రతికి ఉండగా అయోధ్యలో రామ మందిరాన్ని కట్టనివ్వను అని కపిల్ సిబల్ వ్యాఖ్యలు చేసాడని క్లెయిమ్ చేస్తూ ఒక పోస్ట్ ఫేస్బుక్ లో విస్తృతంగా ప్రచారం కాబడుతుంది. ఆ పోస్ట్ లోని క్లెయిమ్ లో ఎంతవరకు వాస్తవమో చూద్దాం.

క్లెయిమ్: కపిల్ సిబల్: “నేను బ్రతికి ఉండగా అయోధ్య లో రామ మందిరం కట్టనివ్వను”.
ఫాక్ట్ (నిజం): కపిల్ సిబల్ అసలు అయోధ్య గురించి అలాంటి వ్యాఖ్యలు ఏవీ చేయలేదు. ఆలా అన్నట్టు ప్రముఖ మీడియా సంస్థలు ఏవి కూడా ఎక్కడా పేర్కొనలేదు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం.
అయోధ్య గురించి కపిల్ సిబల్ చేసాడని ప్రచారం అవుతున్న పోస్టులు తెలుగు భాషలోనే కాకుండా హిందీ భాషలో కూడా ప్రచారం కాబడుతున్నాయి. హిందీ లో ప్రచారం అయిన అలాంటి ఒక పోస్టుని నిజం కాదు అని Factly ఇంగ్లీష్ లో రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చదవవచ్చు. తెలుగులో ప్రచారం అవుతున్న పోస్ట్ కూడా హిందీ పోస్టులోని హెడ్ లైన్ ఆధారంగా తీసుకోని ఉండవచ్చు. ఆ హెడ్ లైన్ తో ప్రచురితమయిన ఆర్టికల్స్ (Digital India TV, Yogi Adithyanath Ki Sena) లోపల మాత్రం కపిల్ సిబల్ అయోధ్య గురించి అటువంటి వ్యాఖ్యలు చేయడం గురించి ఎలాంటి సమాచారం లేదు.

దీని బట్టి కేవలం జనాల్లో సెన్సేషన్ సృష్టించడం కోసం అలాంటి హెడ్ లైన్స్ తో ఆ ఆర్టికల్స్ రాసారని అర్ధం అవుతుంది. ఒకవేళ నిజంగా కపిల్ సిబల్ అయోధ్య గురించి పోస్టులో ప్రచురించిన వ్యాఖ్యలు చేసుంటే, దేశంలో ఏదో ఒక మీడియా సంస్థ వారో, వార్త పత్రిక వారో ఆ వార్తను ప్రచురించేవారు. కానీ, ఎక్కడ కూడా కపిల్ సిబల్ అయోధ్య గురించి అలాంటి వ్యాఖ్యలు చేసినట్టుసమాచారం లేదు.
కావున, కపిల్ సిబల్ తాను బ్రతికి ఉన్నంతవరకు అయోధ్యలో రామ మందిరం కట్టనివ్వను అన్నట్టు ప్రచారం అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?