విశాఖపట్నంలో జనసేన పార్టీ నవంబర్ 3, 2019న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతకు నిరసనగా ‘లాంగ్ మార్చ్’ చేపట్టింది. మార్చ్ లో పాల్గొన్నవారికి ఆ పార్టీ వారు 250 రూపాయల కూలీ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసారంటూ అందుకు సంబంధించిన వీడియో అని ఫేస్బుక్ లో పోస్టు చేశారు. ఆ ఆరోపణ ఎంతవరకు నిజమో చూద్దాం.
క్లెయిమ్: జనసేన పార్టీ ‘లాంగ్ మార్చ్’ కి సంబంధించిన వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో పెట్టిన వీడియో సోషల్ మీడియా లో కనీసం మార్చ్ 23, 2019 నుండి ప్రచారంలో ఉంది. కావున, ఆ వీడియోకి మరియు ఇటీవల జరిగిన ‘లాంగ్ మార్చ్’ కి ఎటువంటి సంబంధం లేదు. పోస్టులో చేసిన ఆరోపణ తప్పు.
జనసేన పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతకు నిరసనగా నవంబర్ 3, 2019న ‘లాంగ్ మార్చ్’ చేపట్టినట్లుగా ‘News 18’ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఆ ‘లాంగ్ మార్చ్’ లో పాల్గొన్నందుకు కూలీ 250 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసారంటూ అందుకు సంబంధించిన వీడియోని ఒక ఒక వ్యక్తి నవంబర్ 3, 2019 న పోస్టు చేసాడు.
ఫేస్బుక్ లో ‘ర్యాలికి వస్తే 250 రూపాయలు’ అనే కీవర్డ్స్ తో వెతికినప్పుడు, కొంతమంది అదే వీడియోని జనసేన పేరుతోనే మార్చ్ 2019 లో పోస్టు చేసినట్లుగా తెలిసింది. వాటిని ఇక్కడ , ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఆ వీడియో కి సంబంధించిన వాస్తవ సమాచారం గురించి వెతికినప్పుడు, దాని గురించి సమాచారం ఏమీ లభించలేదు. కానీ, ఆ వీడియోకి మరియు ఇటీవల జరిగిన ‘లాంగ్ మార్చ్’ కి ఎటువంటి సంబంధం లేదు అని మాత్రం చెప్పొచ్చు.
చివరగా, ఒక పాత వీడియోని పెట్టి జనసేన ‘లాంగ్ మార్చ్’ కి వచ్చిన వారి కూలీ 250 రూపాయలు అంటూ తప్పుడు ఆరోపణతో ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: పాత వీడియో పెట్టి, జనసేన ‘లాంగ్ మార్చ్’ కి వచ్చిన వారికి 250 రూపాయలు కూలీ ఇస్తామని చెప్పి మోసం చే