‘రాయచూర్‌లోని రోడ్ వెడల్పులో భాగంగా కూల్చిన మస్జీద్ కింద జైన దేవాలయం బయటపడింది’, అని చెప్తూ కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రోడ్ వెడల్పులో భాగంగా రాయచూర్‌లో (కర్ణాటక) మసీదు కూల్చినప్పుడు, బయటపడిన జైన దేవాలయం. ఆ దేవాలయానికి సంబంధించిన ఫోటోలు.
ఫాక్ట్: ఫోటోల్లో ఉన్నవి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కోట ప్రాంతంలో ఉన్న జైన శిల్పాలు. అవి తాజగా రాయచూర్‌లో (కర్ణాటక) మసీదు కూల్చినప్పుడు బయటపడలేదు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని ఫోటోలను ఒక్కోటి క్రాప్ చేసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ ఫోటోల్లో ఉన్నవి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కోట ప్రాంతంలో ఉన్న సిద్ధాచల్ గుహల్లోని జైన శిల్పాలు అని తెలిసింది. అవి తాజగా రాయచూర్‌లో మసీదు కూల్చినప్పుడు బయటపడలేదు. ఆ జైన్ శిల్పాలకు సంబంధించిన మరిన్ని ఫోటోలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

ఆ ప్రదేశానికి సంబంధించిన వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

అంతేకాదు, ఇంతకముందు కూడా ఒక ఎడిటెడ్ ఫోటోని ఇలాంటి క్లెయిమ్ ఒకటి పెట్టి, సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కూడా తప్పు అని 2019లో FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ అర్టికల్‌ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ఫోటోల్లో ఉన్నవి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కోట ప్రాంతంలో ఉన్న జైన శిల్పాలు. అవి మసీదు కూల్చినప్పుడు రాయచూర్‌లో బయటపడలేదు.