మార్చి వరకు వైద్య విధానంలో 112 వ స్థానంలో ఉండే భారత్, ఇప్పుడు మోదీ ప్రభుత్వం వల్ల ప్రపంచంలో 15వ స్థానంలో ఉందని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వైద్య విధానంలో భారత్ ప్రపంచంలో 15వ స్థానంలో ఉంది.
ఫాక్ట్ (నిజం): 2000 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వైద్య విధానాల ఆధారంగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్లలో భారత్ 112 వ స్థానంలో ఉంది. కానీ, తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య విధానాల పై ఎటువంటి ర్యాంకింగ్ వెలువడించలేదు. పోస్ట్ లో చెప్పినట్టుగా వైద్య విధానంలో భారత్ ప్రపంచంలో 15వ స్థానంలో ఉన్నట్టు ఏ సంస్థ కూడా ఎటువంటి ర్యాంకింగ్ వెలువరించలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని విషయం గురించి కీ-వర్డ్స్ తో ఇంటర్నెట్ లో వెతకగా, మార్చి 2020 లో ‘Outlook’ వారు ప్రచురించిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. దాంట్లో, 2000 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వైద్య విధానాల ఆధారంగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్లో భారత్ 112 వ స్థానంలో ఉందని తెలుస్తుంది. అయితే, దాని తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాంటి ర్యాంకింగ్ వెలువడించలేదని ఆ ఆర్టికల్ లో చదవొచ్చు. 2000 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసిన ర్యాంకింగ్లకి సంబంధించిన రిపోర్ట్ ని ఇక్కడ చూడవొచ్చు.
పోస్ట్ లో చెప్పినట్టుగా మార్చి 2020 తర్వాత వైద్య విధానంలో భారత్ ప్రపంచంలో 15 వ స్థానంలో ఉన్నట్టు ఎటువంటి ర్యాంకింగ్ వెలువడలేదు. ఒకవేల నిజంగానే భారత్ ర్యాంకు గనక వెల్లడైతే అన్నీ వార్తాసంస్థలు దాని గురించి ప్రచురించేవి; కానీ, అటువంటి సమాచారం ఏదీ కూడా లభించలేదు. అంతేకాదు, 2018 లో వచ్చిన ‘Lancet’ ర్యాంకింగ్లో కూడా భారత్ కి 145 స్థానం వచ్చినట్టు ఇక్కడ చదవొచ్చు. కావున, పోస్టులో చెప్పినదానికి ఎటువంటి ఆధారం లేదు.
చివరగా, వైద్య విధానంలో భారత్ ప్రపంచంలో 15 వ స్థానంలో ఉన్నట్టు ఎటువంటి ప్రముఖ సంస్థ ర్యాంకింగ్ వెల్లడించలేదు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?