Fake News, Telugu
 

ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ఉద్దేశపుర్వకంగానే వ్యంగ్యమైన ఇంగ్లీష్ భాషలో ప్రసంగించాడు

0

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ భాషలో మాట్లాడటానికి తడబడిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ భాషలో మాట్లాడటానికి తడబడిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): 2019లో జనసేన నిర్వహించిన ఒక సభలో, వై.కా.పా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు మీడియం పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మార్చాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పవన్ కళ్యాణ్ ఇలా వ్యంగ్యమైన ఇంగ్లీష్ బాషలో ప్రసంగించారు. మాతృభాష తెలుగు మూలాలు, యాస, మాండలికాలు తెలిస్తే, ఇంగ్లీష్ బాష కూడా సరిగా మాట్లడుతామని, తెలుగు భాషనే తీసివేస్తే ఇంగ్లిష్ భాష ఇలా ఉంటుందని పవన్ కళ్యాణ్ తన ఈ ఇంగ్లీష్ ప్రసంగం తరువాత వివరించారు. పవన్ కళ్యాణ్ పలు సభలలో ఇంగ్లిష్ భాషలో అనర్గళంగా ప్రసంగించాడు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.   

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం ఇంటర్నెట్లో వెతికితే, ఈ వీడియోని ‘ISPARK MEDIA’ యూట్యూబ్ ఛానల్ 05 డిసెంబర్ 2019 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ‘పవన్ ఫన్ని ఇంగ్లీష్’ అనే టైటిల్‌తో ఈ వీడియోని పబ్లిష్ చేసారు. పవన్ కళ్యాణ్ తన ఈ హస్యాస్పద ఇంగ్లీష్ ప్రసంగం తరువాత, “మాతృ భాష మూలాలు తెలిస్తే, తెలుగు యాస, మాండలికాలు బాగా వస్తే, ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడగలం. అలా కాకుండా తెలుగు భాషనే తీసివేస్తే, ఇప్పుడు ఇందాక మాట్లాడాను కదా అలా ఉంటది ఇంగ్లిష్ భాష”, అని అన్నారు.

వైఎస్ జగన్ నాయకత్వంలోని వై.కా.పా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు మీడియం పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మార్చాలనుకుంటూ తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ ఇలా హస్యోస్పద ఇంగ్లీష్ ప్రసంగం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పలు సభలలో ఇంగ్లిష్ భాషలో అనర్గళంగా ప్రసంగించిన వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, పవన్ కళ్యాణ్ ఉద్దేశపుర్వకంగా వ్యంగ్యమైన ఇంగ్లీష్ భాషలో ప్రసంగించిన పాత వీడియోని ఇంగ్లీష్ భాషలో మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ తడబడుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll