Fake News, Telugu
 

2020లో బాంబు పెట్టిన ఆహారం తిని ఒక గర్భిణి ఏనుగు కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో మృతి చెందింది, మలప్పురం జిల్లాలో కాదు; ఇటీవల కొండచరియలు విరిగిపడినది వాయనాడ్‌లో

0

ఇటీవల 30 జూలై 2024న కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 360 మందికి పైగా మరణించారు, సుమారు 200 మందికి  పైగా ఆచూకీ లభించడం లేదు (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలోనే, “కేరళలోని గర్భవతి అయిన ఏనుగుకు కొంతమంది గ్రామస్తులు పైనాపిల్ లోపల బాంబు పెట్టి తినిపించి చంపారు. ఆ గ్రామం పేరు “మల్లాపురం”, ఇప్పుడు కొండచరియలు విరిగిపడటంతో ఆ గ్రామం పూర్తిగా కనుమరుగైంది” అంటూ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేరళలోని “మల్లాపురం” అనే  గ్రామంలో గర్భవతి అయిన ఏనుగుకు కొంతమంది గ్రామస్తులు పైనాపిల్ లోపల బాంబు పెట్టి తినిపించి చంపారు, ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో ఆ గ్రామం పూర్తిగా కనుమరుగైంది.

ఫాక్ట్(నిజం): పలు రిపోర్ట్స్ ప్రకారం, మే 2020లో కేరళ పాలక్కాడ్ జిల్లాలోనీ మన్నార్క్కాడ్ ఫారెస్ట్ రేంజ్ డివిజన్ పరిధిలోని సైలెంట్ వ్యాలీ ప్రాంతంలో, బాంబు పెట్టిన ఆహారం (పైనపిల్/ కొబ్బరికాయ) తిని ఒక గర్భిణి ఏనుగు మృతి చెందింది. ఈ కేసులో పాలక్కాడ్ జిల్లాకు చెందిన విల్సన్, అబ్దుల్ కరీమ్, రియాసుద్దీన్ అనే ముగ్గురు అనుమానితులను గుర్తించారు. ఈ కేసు విచారణలో విల్సన్, కరీమ్ తన ఎస్టేట్ లో అడివి పందులను చంపడానికి కొబ్బరికాయలో నాటు బాంబు పెట్టగా పొరపాటున ఏనుగు తిని గాయమై మరించినట్లు పేర్కొన్నాడు. ఇటీవల కొండచరియలు వయనాడ్ జిల్లాలో విరిపడ్డాయి, మలప్పురం లేదా పాలక్కాడ్ జిల్లాలలో కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ క్లెయిమ్‌లో పేర్కొన్నట్లుగా, కేరళలోని వాయనాడ్ జిల్లాలో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడిన ఘటనలో మలప్పురం గ్రామం పూర్తిగా ధ్వంసమైందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, పలు రిపోర్ట్స్ ప్రకారం,ఇటీవల వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన గ్రామాలలో మలప్పురం అనే గ్రామం లేదని తెలిసింది. పలు రిపోర్ట్స్ ప్రకారం, 30 జూలై 2024 తెల్లవారుజామున కేరళలోని వయనాడ్ జిల్లాలోని పుంజీరిమట్టం, ముండక్కై, చూరల్‌మల, అట్టమల, మెప్పాడి మరియు కున్‌హోమ్ గ్రామాలలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ ఘటనలో 360 మందికి పైగా మరణించారు, సుమారు 200 మందికి  పైగా ఆచూకీ లభించడం లేదు (ఇక్కడ, ఇక్కడ).

ఇకపోతే  వైరల్ పోస్టులో  పేర్కొన్నట్లుగా, పైనాపిల్ లోపల బాంబు పెట్టి గర్భవతి అయిన ఏనుగును “మల్లాపురం”, అనే  గ్రామంలో చంపారా? అని తగిన అని తగిన కీవర్డ్స ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, జూన్ 2020లో పబ్లిష్ అయిన పలు రిపోర్ట్స్ లభించాయి(ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ రిపోర్ట్స్ ప్రకారం, మే 2020లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని సైలెంట్ వ్యాలీ ప్రాంతంలో బాంబు పెట్టిన పైనాపిల్ తిని గర్భిణి ఏనుగు నోటికి గాయమై చనిపోయిందని తెలిసింది.

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా,ఈ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(NGT) సుమోటోగా కేసు నమోదు చేసింది అని తెలిసింది (ఇక్కడ, ఇక్కడ). ఈ కేసుకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ & వాతావరణ మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, ఈ ఘటన పాలక్కాడ్ జిల్లాలోనీ మన్నార్క్కాడ్ ఫారెస్ట్ రేంజ్ డివిజన్ పరిధిలో జరిగింది, మలప్పురం జిల్లాలో కాదు. కానీ ఎప్పడు, ఎక్కడ జరిగింది అని  మాత్రం ఖచ్చితంగా తెలియలేదు. ఈ కేసులో పాలక్కాడ్ జిల్లాకు చెందిన విల్సన్, అబ్దుల్ కరీమ్, రియాసుద్దీన్ అనే ముగ్గురు అనుమానితులను గుర్తించినట్లు తెలిసింది. అలాగే ఈ కేసు విచారణలో భాగంగా విల్సన్, కరీమ్ తన ఎస్టేట్ లో అడివి పందులను చంపడానికి కొబ్బరికాయలో నాటు బాంబు పెట్టగా పొరపాటున ఏనుగు తిని గాయమై మరించినట్లు పేర్కొన్నాడు అని తెలిసింది.

బాంబు పెట్టిన పైనాపిల్ తిని గర్భిణి ఏనుగు పాలక్కాడ్ జిల్లాలో మృతి చెందగా కొందరు ముస్లింలు ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలో ఈ ఘటన జరిగింది చెప్తూ మతపరమైన కోణంలో ప్రచారం చేశారని పేర్కొంటూ జూన్ 2020లో పబ్లిష్ అయిన పలు రిపోర్టులు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ).

దీన్ని బట్టి 2020లో బాంబు పెట్టిన పైనాపిల్ తిని గర్భిణి ఏనుగు పాలక్కాడ్ జిల్లాలో మృతి చెందిందని, వైరల్ పోస్టులో పేర్కొన్నట్లు మలప్పురం జిల్లాలో కాదని, ఇటీవల కొండచరియలు వయనాడ్ జిల్లాలో విరిగిపడ్డాయని , మలప్పురం లేదా పాలక్కాడ్ జిల్లాలలో కాదని మనం నిర్ధారించవచ్చు. పాలక్కాడ్ జిల్లాలోని సైలెంట్ వ్యాలీ ప్రాంతం మరియు వాయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను గూగుల్ మ్యాప్‌లో క్రింద చూడవచ్చు.

చివరగా, 2020లో బాంబు పెట్టిన ఆహారం తిని ఒక గర్భిణి ఏనుగు కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో మృతి చెందింది, మలప్పురం జిల్లాలో కాదు; ఇటీవల వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి.

Share.

About Author

Comments are closed.

scroll