‘CAA వ్యతిరేక ఉద్యమంలో హిందూ దేవుళ్ళ ఫోటోలను తగలపెట్టిన ఉద్యమకారులు’ అని చెప్తూ ఒక ఫేస్బుక్ వినియోగదారుడు పోస్టు చేశాడు. అతను అదే ఆరోపణతో ఉన్న వీడియోతో కూడిన ట్వీట్ (ఆర్కైవ్డ్) ని కామెంట్స్ లో పెట్టాడు. ఆ వీడియో గురించి చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వీడియో CAA వ్యతిరేక ఉద్యమంలో హిందూ దేవుళ్ళ ఫోటోలను ఉద్యమకారులు తగలపెట్టినది.
ఫాక్ట్ (నిజం): వీడియో ఇంటర్నెట్ లో కనీసం ఆగష్టు 2018 నుండి ఉంది. కావున, దానికి ప్రస్తుత CAA వ్యతిరేక ఉద్యమానికి ఎటువంటి సంబంధం లేదు. పోస్టులో చెప్పింది తప్పు.
పోస్టులోని కామెంట్స్ లో పెట్టిన ట్వీట్ ని బీజేపీ జాతీయ ప్రతినిధి ‘సంబిత్ పాత్ర’ కూడా రీ-ట్వీట్ (ఆర్కైవ్డ్)చేశారు.
ఫేస్బుక్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, అదే వీడియో ని ఒక వినియోగదారుడు ఆగష్టు 2018 లో పోస్టు చేసినట్లుగా తెలిసింది. ఆ వీడియో (ఆర్చివ్డ్) గురించి ఆ పోస్టు లో ఈ వివరణ ఉంది- “*Young Ambedkarites burning portraits of Hindu Gods in Ashokpuram MYSORE* to protest against Sanghis who burned copies of the Constitution”. ఆ వీడియో గురించిన ఖచ్చితమైన సమాచారం ఏమీ దొరకకపోయినా, అది 2018 నుండి ఇంటర్నెట్ లో ఉండడంతో, దానికీ మరియు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న CAA వ్యతిరేక ఉద్యమానికి సంబంధం లేదు అనే నిర్ధారణకు రావొచ్చు.
చివరగా, ఒక పాత వీడియోని పెట్టి ‘CAA వ్యతిరేక ఉద్యమంలో హిందూ దేవుళ్ళ ఫోటోలను తగలపెట్టిన ఉద్యమకారులు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?