Fake News, Telugu
 

బస్సు, ట్రక్ పైనుండి కార్ దూకుతున్న కంప్యూటర్ గ్రాఫిక్ వీడియోని నిజమైనదిగా షేర్ చేస్తున్నారు

0

వేగంగా వస్తున్న కార్ ఎదురుగా ఉన్న పోలీస్ వాహనాన్ని తప్పించుకునే క్రమంలో పక్కనున్న రెండు అండర్ పాస్ లలో వస్తున్న ట్రక్, బస్సు పైనుండి దూకుతూ అవతలి రోడ్డుకి చేరుకున్న వీడియోని నిజంగా జరిగిన సంఘటన అని అర్ధం వచ్చేలా షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రెండు అండర్ పాస్ లలో వస్తున్న ట్రక్, బస్సులపై నుండి ఒక కార్ దూకుతూ రోడ్డు అవతలి వైపుకు చేరుకున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఇది ఒక కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా తయారు చేయబడ్డ వీడియో. డయోనిసిస్ అనే UKకి చెందిన గ్రాఫిక్ డిజైనర్ ఈ వీడియోని తాయారు చేసి తన సోషల్ మీడియా అకౌంట్స్ మరియు యూట్యూబ్ ఎకౌంటులో షేర్ చేసాడు. ఇలాంటివే మరికొన్ని వీడియోలు ఈ అకౌంట్స్ లో చూడొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ మాకు కనిపించింది. 2ncs పేరుతో గల వెరిఫైడ్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంటు కలిగిన ఒక గ్రాఫిక్ డిజైనర్ ఇదే వీడియోని #3డి మరియు #యానిమేషన్ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో తన ఎకౌంటులో షేర్ చేసాడు.

ఐతే ఈ ఇన్స్టాగ్రామ్ ఎకౌంటు ఆధారంగా ఇతని గురించి మరింత సమాచారం కోసం గూగుల్ లో ‘2ncs’ అనే కీవర్డ్ తో వెతకగా 2ncscgartist.wixsite.com అనే వెబ్సైటు కనిపించింది. ఈ వెబ్సైటులో పైన తెలిపిన ఇన్స్టాగ్రామ్ ఎకౌంటు ఎంబెడ్ చేసి ఉండడం వల్ల ఈ వెబ్సైటు ఆ ఇన్స్టాగ్రామ్ ఎకౌంటుకి సంబంధించిందే అని చెప్పొచ్చు. ఐతే ఈ వెబ్సైటులో ఉన్న సమాచారం ప్రకారం ఇతని పేరు డయోనిసిస్ అని, ఇతను UKకి చెందిన గ్రాఫిక్ డిజైనర్ అని తెలుస్తుంది.

యూట్యూబ్ లో 2ncs ఛానల్ లో పోస్టులో ఉన్న వీడియో లాంటివే చాలా గ్రాఫిక్ వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నాయి. అలంటి ఒకే వీడియోలో కంప్యూటర్ గ్రాఫిక్ ద్వారా ఒక కారు సెమి ట్రక్ కింది నుండి ఎలా తప్పించునేలా చేసాడో చూపించాడు. వీటన్నిటి ఆధారంగా పోస్టులోని వీడియో కూడా ఒక కంప్యూటర్ గ్రాఫిక్ ద్వారా చేసిన వీడియో అని కచ్చితంగా చెప్పొచ్చు.

అలాగే పోస్టులోని వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం FACTLY డయోనిసిస్ ని 2ncs  ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించింది. అతని నుండి వివరణ వచ్చిన తరవాత ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

చివరగా, బస్సు మరియు ట్రక్ పైనుండి ఒక కార్ దూకుతున్న ఒక కంప్యూటర్ గ్రాఫిక్ వీడియోని నిజమైన వీడియోగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll