Fake News, Telugu
 

ఫ్లైట్ సిములేషన్ వీడియో పెట్టి, కోజికోడ్ విమాన ప్రమాదం దృశ్యాలు అని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు

0

కేరళ లోని కోజికోడ్ లో జరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాదానికి చెందిన దృశ్యాలు అని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కోజికోడ్ లో జరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాదం దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోనివి నిజమైన దృశ్యాలు కావు. అది ఒక సిములేషన్ వీడియో. ప్రమాదం ఎలా జరిగిందో అంచనా వేస్తూ రూపొందించిన ఒక యానిమేటెడ్ వీడియో మాత్రమే. కావున పోస్ట్ లో విమాన ప్రమాదం దృశ్యాలు అని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

07 ఆగస్టు 2020 న దుబాయ్ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కోజికోడ్ లో ల్యాండింగ్ సమయంలో రన్‌వే పై జారి లోయలో పడిపోయింది. ఆ ఘటన లో 18 మంది వరకు చనిపోయారు, మరికొందరికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

పోస్ట్ లోని వీడియో చూస్తే, అది ఒక యానిమేటెడ్ వీడియో లాగా కనపడుతుంది. కావున, కొన్ని కీ-వర్డ్స్ తో యూట్యూబ్ లో వెతకగా, 07 ఆగస్టు 2020 న జరిగిన ప్రమాదం యొక్క దృశ్యాలు అని ఎన్నో యానిమేటెడ్ వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. పోస్ట్ లోని వీడియోని కూడా ఒకరు ప్రమాదం జరిగినే రోజే అప్లోడ్ చేసినట్టుగా చూడవొచ్చు. అయితే, ఆ వీడియో యొక్క వివరణలో అది ఒక సిములేషన్ వీడియో అని ఉన్నట్టు తెలుస్తుంది. వీడియో టైటిల్ లో కూడా ‘P3D’ అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. ‘P3D’ లేదా ‘Prepar3D’ అనేది ఒక సిములేషన్ సాఫ్ట్ వేర్. కోజికోడ్ ప్రమాదానికి సంబంధించిన మరికొందరు పోస్ట్ చేసిన యానిమేటెడ్ సిములేషన్ వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ఫ్లైట్ సిములేషన్ వీడియో పెట్టి, కోజికోడ్ విమాన ప్రమాదం దృశ్యాలు అని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll