ఫోటోగ్రాఫర్‌ని నేలపై పడుకోబెట్టి మరీ తన ఫోటోని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీయించుకుంటున్నట్టు చెప్తూ, ఒక ఫోటోని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఫోటోగ్రాఫర్‌ని నేలపై పడుకోబెట్టి మరీ తన ఫోటోని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీయించుకుంటున్నట్టు ఫోటోలో చూడవచ్చు.
ఫాక్ట్: పోస్ట్‌లోనిది ఒక ఎడిటెడ్ ఫోటో. నేలపై పడుకున్న ఫోటోగ్రాఫర్ ఒరిజినల్ ఫోటోలో లేడు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ ఫోటోకి సంబంధించిన చాలా ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి. అయితే, ఆ ఫోటోల్లో ఫోటోగ్రాఫర్ నేలపై పడుకున్నట్టు ఎక్కడా కనిపించడు. ఒరిజినల్ ఫోటోని వివిధ కాంగ్రెస్ నేతలు మరియు జర్నలిస్టులు పోస్ట్ చేసినట్టు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. కాబట్టి, పోస్ట్‌లోనిది ఒక ఎడిట్ చేసిన ఫోటో.

అంతేకాదు, కింద పడుకున్న ఫోటోగ్రాఫర్‌ని మరొక ఫోటోలో నుండి తీసుకున్నట్టు తెలిసింది. ఆ ఫోటోగ్రాఫర్ కింద పడుకొని ఉన్న అసలు ఫోటోని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఎడిటెడ్ ఫోటోని చూపిస్తూ, ప్రియాంక గాంధీ ఫోటోగ్రాఫర్‌ని నేలపై పడుకోబెట్టి మరీ ఫోటోని తీయించుకుంటున్నట్టు షేర్ చేస్తున్నారు.