Fake News, Telugu
 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేయించారని పేర్కొంటూ దిశ పత్రిక ఈ వార్తను ప్రచురించలేదు

0

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమ ప్రభుత్వంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేయించారని పేర్కొంటూ ‘దిశ డైలీ’ కథనం ప్రచురించినట్లు న్యూస్ క్లిప్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమ ప్రభుత్వంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేయించారు – దిశ డైలీ వార్త కథనం. 

ఫాక్ట్(నిజం): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేయించారని పేర్కొంటూ దిశ డైలీ ఈ కథనాన్ని ప్రచురించలేదు. వైరల్‌ న్యూస్ పేపర్ క్లిప్ ఫేక్. 08 జనవరి 2026 రోజటి దిశ డైలీ పత్రికలో ఈ వార్త లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమ ప్రభుత్వంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేయించారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. 

తదుపరి మేము ‘దిశ డైలీ’ అధికారిక వెబ్‌సైట్‌ను కూడా పరిశీలించాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేశారనే కథనాన్ని ప్రచురించినట్లు మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.

వైరల్ న్యూస్‌పేపర్ క్లిప్‌ను జాగ్రత్తగా పరిశీలించగా, క్లిప్ ఎడమ కిందభాగంలో గురువారం 08 జనవరి 2026 అనే వాటర్‌మార్క్‌తో పాటు ఒక లింక్ ఉన్నట్టు మేము గమనించాము. అంటే, ఈ న్యూస్ పేపర్ క్లిప్ ఆ తేదీన ‘దిశ డైలీ’ పత్రికలో ప్రచురితమైందని తెలుస్తోంది. 

తరువాత, మేము ఈ లింక్‌ను గూగుల్‌లో వెతికినపుడు, దిశ డైలీ అసలు న్యూస్‌పేపర్ క్లిప్‌ను కనుగొన్నాము. ఈ క్లిప్‌లో ఎక్కడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి ప్రస్తావన లేదు; అందులో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడిన విషయాలను పేర్కొన్నారు.

ఈ వైరల్ న్యూస్‌పేపర్ క్లిప్ దిశ డైలీ 08 జనవరి 2026 నాటి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌ లో ప్రచురితమై ఉండొచ్చని, మేము అదే రోజు ‘దిశ డైలీ’ న్యూస్‌పేపర్ డిజిటల్ కాపీని (ఆర్కైవ్డ్ లింక్) తనిఖీ చేసాము. అయితే, ఈ రకమైన కథనం వార్తాపత్రికలో ఎక్కడా కనిపించలేదు. దీన్ని బట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్‌పేపర్ క్లిప్ ఫేక్ అని స్పష్టమవుతుంది.

08 జనవరి 2026న తెలంగాణ ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్-చెకింగ్ విభాగం Xలో (ఆర్కైవ్డ్ లింక్)  వైరల్ అవుతున్న ఈ న్యూస్ పేపర్ క్లిప్ ఫేక్ అని  పేర్కొంటూ పోస్ట్ చేసింది.

చివరిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేయించారని పేర్కొంటూ దిశ డైలీ ఈ వార్త ప్రచురించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll