19 మార్చి 2024న విశాఖపట్నం ఓడరేవు వద్ద విశాఖపట్నంకు చెందిన ఓ ప్రైవేట్ ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్‌లో 25 వేల కిలోల డ్రగ్స్‌ని సీబీఐ అధికారులు తనిఖీ చేసి గుర్తించారు (ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం డ్రగ్స్ కేసులో నైతిక బాధ్యత వహిస్తూ తెలుగుదేశం పార్టీకి దామచర్ల సత్యనారాయణ రాజీనామా చేశారు అని చెప్తూ పలు పోస్టులు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ పై దామచర్ల సత్యనారాయణ పేరుతో గల ఒక పత్రికా ప్రకటనను జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తెలుగుదేశం పార్టీకి దామచర్ల సత్యనారాయణ రాజీనామా.
ఫాక్ట్(నిజం): దామచర్ల సత్యనారాయణ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఎటువంటి రిపోర్ట్స్ లభించలేదు. అంతేకాకుండా, తెలుగుదేశం పార్టీకి దామచర్ల సత్యనారాయణ రాజీనామా చేస్తున్నట్లు ఎటువంటి పత్రికా ప్రకటన విడుదల చేయలేదని తెలిసింది. ఈ వైరల్ క్లెయిమ్ పై 22 మార్చి 2024న తెలుగుదేశం పార్టీ తమ అధికారిక X (ట్విట్టర్)లో స్పందిస్తూ ఈ వైరల్ తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ పై దామచర్ల సత్యనారాయణ పేరుతో గల పత్రికా ప్రకటన ఫేక్ అని స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
మేము ముందుగా ఈ వైరల్ క్లెయిమ్ గురించి సమచారం కోసం దామచర్ల సత్యనారాయణ యొక్క సోషల్ మీడియా అకౌంట్లను (ఇక్కడ & ఇక్కడ) పరిశీలించగా, ఎక్కడా కూడా దామచర్ల సత్యనారాయణ తను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు పోస్టులు చేయలేదు అని తెలిసింది.
తదుపరి ఈ వైరల్ క్లెయిమ్ గురించి మరింత సమాచరం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, దామచర్ల సత్యనారాయణ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం లభించలేదు. అంతేకాకుండా, తెలుగుదేశం పార్టీకి దామచర్ల సత్యనారాయణ రాజీనామా చేస్తున్నట్లు ఎటువంటి పత్రికా ప్రకటన విడుదల చేయలేదని తెలిసింది. ఈ వైరల్ క్లెయిమ్ పై 22 మార్చి 2024న తెలుగుదేశం పార్టీ తమ అధికారిక X(ట్విట్టర్)లో స్పందిస్తూ (ఆర్కైవ్డ్ లింక్) ఈ వైరల్ తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ పై దామచర్ల సత్యనారాయణ పేరుతో గల రాజీనామా పత్రం ఫేక్ అని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ తమ అధికారిక ఫేస్‌బుక్‌లో కూడా స్పష్టం చేసింది.
చివరగా, తెలుగుదేశం పార్టీకి దామచర్ల సత్యనారాయణ రాజీనామా చేస్తున్నట్లు ఎటువంటి పత్రికా ప్రకటన విడుదల చేయలేదు, ఈ వైరల్ పత్రికా ప్రకటన ఫేక్.