Fake News, Telugu
 

‘CNN’ సంస్థ తాలిబాన్లను పొగుడుతూ రిపోర్ట్ చేసినట్టుగా షేర్ చేస్తున్నది వ్యంగ్యంగా రాసిన ఆర్టికల్

0

‘CNN’ అంతర్జాతీయ వార్తా సంస్థ, తాలిబన్లు మాస్కులు ధరించి భాద్యతాయుతంగా యుద్ధం చేస్తున్నారని ‘పొగుడుతూ ఆర్టికల్ పబ్లిష్ చేసిందంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘CNN’ వార్త సంస్థ, తాలిబన్లు మాస్కులు ధరించి బాధ్యతయుతంగా యుద్ధం చేస్తున్నారని పొగుడుతూ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులో షేర్ చేసిన ఆర్టికల్‌ని ‘The Babylon Bee’ అనే సటైరికల్ వెబ్సైటు పబ్లిష్ చేసింది. తాలిబన్లను పొగుడుతూ ‘CNN’ న్యూస్ సంస్థ ఇటీవల ఎటువంటి ఆర్టికల్‌ని పబ్లిష్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఆర్టికల్‌కి సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, ఈ ఆర్టికల్‌ని 14 ఆగష్టు 2021 నాడు ‘The Babylon Bee’ అనే వెబ్సైటు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ‘The Babylon Bee’ అనేది అమెరికా దేశానికి చెందిన ఒక సటైరికల్ వెబ్సైటు అని తెలిసింది. వ్యంగ్యంగా రాసిన కల్పిత కథనాలని ప్రచురిస్తామని ఈ వెబ్సైటు వివరణలో స్పష్టంగా తెలిపారు. ‘The Babylon Bee’ సటైరికల్ వెబ్సైటు ఈ ఆర్టికల్‌ని షేర్ చేస్తూ 15 ఆగష్టు 2021 ట్వీట్ కూడా పెట్టింది.

పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టుగా ‘CNN’ న్యూస్ సంస్థ తాలిబన్లను పొగుడుతూ ఇటీవల ఆర్టికల్స్ ఏమైన పబ్లిష్ చేసిందా అని వెతకగా, అటువంటి ఆర్టికల్స్ ఏవి ‘CNN’ న్యూస్ సంస్థ తమ వెబ్సైటులో పబ్లిష్ చేయలేదని తెలిసింది. ఆఫ్ఘానిస్తాన్ దేశంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోబాన్ని రిపోర్ట్ చేస్తూ ‘CNN’ న్యూస్ సంస్థ పబ్లిష్ చేసిన అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆఫ్ఘానిస్తాన్ దేశం నుండి తమ సైనిక బలగాల ఉపసంహరణకు 11 సెప్టెంబర్ 2021 చివరి తేది అని ప్రకటించిన వెంటనే, తాలిబాన్ ఉగ్రవాదులు ఆఫ్ఘానిస్తాన్ దేశంలో మళ్ళీ రక్తపాతం సృష్టిస్తూ పలు ప్రాంతాలని ఆక్రమించడం మొదలుపెట్టారు. 15 ఆగష్టు 2021 నాడు తాలిబాన్ మూకలు ఆఫ్ఘాన్ రాజధాని కాబుల్ నగరాన్ని ఆక్రమించి, అధ్యక్ష భవనాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఆఫ్ఘాన్ దేశం విడిచి వెళ్ళిపోవడంతో, ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వంతో తాము చేస్తున్న యుద్ధం ముగిసినట్టు తాలిబన్లు అధికారికంగా ప్రకటించారు.

చివరగా, ‘CNN’ సంస్థ తాలిబాన్లను పొగుడుతూ న్యూస్ రిపోర్ట్ చేసినట్టుగా షేర్ చేస్తున్నది వ్యంగ్యంగా రాసిన ఆర్టికల్, నిజమైనది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll