ఐసిస్ లీడర్ అబూ బకర్ అల్ బగ్దాదీ ని ‘నిరాయుధుడైన ముగ్గురు పిల్లల తండ్రి’ గా ‘CNN’ న్యూస్ ఛానల్ అభివర్ణించిందని ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: అబూ బకర్ అల్ బగ్దాదీ ని ‘నిరాయుధుడైన ముగ్గురు పిల్లల తండ్రి’ గా అభివర్ణించిన ‘CNN’ న్యూస్ ఛానల్.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటో ఒక ఎడిటెడ్ ఫోటో. ఫోటోలో ఉన్న టీవీ యాంకర్ ఫోటోని పది నెలల ముందు ప్రచురించిన ఆర్టికల్ లో చూడవొచ్చు. ‘CNN’ న్యూస్ ఛానల్ వారు అబూ బకర్ అల్ బగ్దాదీ ని ‘నిరాయుధుడైన ముగ్గురు పిల్లల తండ్రి’ గా పిలవలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
‘CNN’ న్యూస్ ఛానల్ వారి న్యూస్ వీడియోలను సరిగ్గా గమనిస్తే, ఫ్రేమ్ కింద భాగంలో ఉన్న తెల్ల స్ట్రిప్ మీద ఉన్న పదాలలోని అక్షరాలన్నీ తప్పనిసరిగా కాపిటల్ అక్షరాలు ఉంటాయి. కానీ, పోస్ట్ చేసిన ఫోటోలో చూస్తే అన్ని అక్షరాలు కాపిటల్ అక్షరాలు ఉండవు.
ఫోటోలోని టీవీ యాంకర్ (డాన్ లెమన్) ఫోటోని క్రాప్ చేసి యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటో పది నెలల ముందు ప్రచురించిన ఒక ఆర్టికల్ లో దొరుకుతుంది.
సాధారణంగా డాన్ లెమన్ షో ‘CNN Tonight’ వీక్ డేస్ లో రాత్రి 10 మరియు 12 (ET – ఈస్టర్న్ టైం) మధ్య వస్తుంది. కానీ, పోస్ట్ చేసిన ఫోటో లో టైం ‘9:01 pm ET’ అని ఉన్నట్టుగా చూడవొచ్చు మరియు బగ్దాదీ మరణ వార్త గురించి బ్రేకింగ్ న్యూస్ ఆదివారం రోజున వచ్చింది. అంతేకాదు, స్నోప్స్ ఆర్టికల్ ప్రకారం, ‘CNN’ న్యూస్ ఛానల్ లో బగ్దాదీ మరణ వార్త గురించి బ్రేకింగ్ న్యూస్ చెప్పింది యాంకర్ జేక్ టాప్పర్ మరియు అప్పుడు టీవీ లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్: ‘President Trump Announces ISIS Leader Al-Baghdadi Is Dead.’
‘CNN Breaking News’ ట్విట్టర్ హ్యాండిల్ లో మరియు ఈ సంఘటన గురించి ‘CNN’ లైవ్ అప్డేట్స్ ఇచ్చిన పేజీలో కూడా పోస్ట్ లో చెప్పినట్టుగా బగ్దాదీని ‘CNN’ పిలిచినట్టు ఎక్కడా కూడా లేదు.
President Trump confirms the death of ISIS leader Abu Bakr al-Baghdadi after a US raid in Syria. Follow live updates: https://t.co/lHyITEZ1mg pic.twitter.com/sa2XZx5HL8
— CNN Breaking News (@cnnbrk) October 27, 2019
చివరగా, ఐసిస్ లీడర్ అబూ బకర్ అల్ బగ్దాదీ ని ‘నిరాయుధుడైన ముగ్గురు పిల్లల తండ్రి’ గా ‘CNN’ న్యూస్ ఛానల్ అభివర్ణించలేదు. అది ఒక ఎడిటెడ్ ఫోటో.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ISIS లీడర్ అబూ బకర్ అల్ బగ్దాదీ ని ‘నిరాయుధుడైన ముగ్గురు పిల్లల తండ్రి’ గా ‘CNN’ న్యూస్ ఛానల్ అభివర