అయోధ్య లో నిర్మించే రామ మందిరానికి కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ఒక న్యూస్ ఆర్టికల్ తో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: అయోధ్య మందిరానికి 10,000 కోట్ల రూపాయులు కేటాయించనున్న కేంద్ర ప్రభుత్వం.
ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వం అయోధ్య మందిరానికి 10,000 కోట్ల రూపాయులు కేటాయించనున్నట్లు ఎక్కడా కూడా వెల్లడించలేదు. అయోధ్య మందిరానికి ‘10,000 కోట్ల రూపాయులు కేటాయించాలి’ అని సిద్దార్థ్ పాయ్ అనే వ్యక్తి ట్వీట్ చేయగా, ఆ ట్వీట్ పెట్టి, పోస్ట్ లోని న్యూస్ ఆర్టికల్ లో ‘10,000 కోట్ల రూపాయులు కేటాయించనున్న కేంద్ర ప్రభుత్వం’ అని రాసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లో పెట్టిన న్యూస్ ఆర్టికల్(ఆర్కైవ్డ్ వెర్షన్) ని చదవగా, అయోధ్య విషయంలో సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు పై అమిత్ షా చేసిన ట్వీట్ కింద సిద్దార్థ్ పాయ్ అనే వ్యక్తి అయోధ్య మందిరానికి కేంద్ర ప్రభుత్వం ‘10,000 కోట్ల రూపాయులు కేటాయించాలి’ అని ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ట్వీట్ పెట్టి, న్యూస్ ఆర్టికల్ లో ‘10,000 కోట్ల రూపాయులు కేటాయించనున్న కేంద్ర ప్రభుత్వం’ అని రాసారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సిద్ధార్థ్ అడిగాడు, కేటాయించినట్టు చెప్పలేదు.
ఈ విషయం పై గూగుల్ లో వెతకగా, కేంద్ర ప్రభుత్వం అయోధ్య మందిరానికి 10,000 కోట్ల రూపాయులు కేటాయించనున్నట్లు ఎక్కడా కూడా సమాచారం దొరకలేదు. అయోధ్య తీర్పు విషయం పై అమిత్ షా, మోడీ మరియు ప్రహలాద్ సింగ్ పటేల్ చేసిన ట్వీట్లలో ఎక్కడా కూడా రామ మందిరానికి కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయులు కేటాయించనున్నట్లు చెప్పలేదు.
సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పులో కూడా కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లో ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి, దానికి భూమిని అప్పగించాలని ఉంటుంది. ఎక్కడా కూడా మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించవలసిన డబ్బు వివరాల గురించి కోర్టు ప్రస్తావించలేదు.
చివరగా, అయోధ్య మందిరానికి 10,000 కోట్ల రూపాయులు కేటాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వెల్లడించలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: అయోధ్య రామ మందిరానికి 10,000 కోట్ల రూపాయులు కేటాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వెల్ల