Fake News, Telugu
 

ప్రధాని మోదీని ఎద్దేవా చేస్తూ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఈ వ్యాఖ్యలు చేయలేదు

0

‘72 యేండ్ల వయసులో 18 గంటలు పనిచేస్తే, మంచి యువ వయసులో ఉన్నప్పుడు బిచ్చమెందుకు ఎత్తుకున్నడు??’ అని కరీనా కపూర్ ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు అని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (మోదీ 18 గంటలు పని చేస్తారని అమిత్ షా గతంలో అన్నారు). ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: 72 యేండ్ల వయసులో 18 గంటలు పనిచేస్తే, మంచి యువ వయసులో ఉన్నప్పుడు బిచ్చమెందుకు ఎత్తుకున్నడు?? – కరీనా కపూర్.

ఫాక్ట్ (నిజం): కరీనా కపూర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఎటువంటి వార్త కథనాలు లేవు. @Kareena_Kpn1 అనే కరీనా కపూర్ యొక్క ట్విట్టర్ ఫ్యాన్ అకౌంట్ చేసిన ట్వీటుని ఈ పోస్టు ద్వారా తనకి తప్పుగా ఆపాదిస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులోని చెప్తున్నట్టుగా అసలు కరీనా కపూర్  ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఏమైనా వార్తా కథనాలు ఉన్నాయా అని ఇంటర్నెట్లో వెతకగా, ఎటువంటి సంబంధిత కథనాలు లభించలేదు.

దీనిపైన మరింత సమాచారం కోసం కీ వర్డ్స్ ఉపయోగించి ఫేస్‌బుక్‌లో వెతకగా వైరల్ పోస్టులోని  క్లెయిముతో ఉన్న మరిన్ని పోస్టులు దొరికాయి. వీటిలోని ఒక పోస్టులో ‘చాలా గంభీరమైన విషయం. 72 యేండ్ల వయసులో 18 గంటలు పనిచేస్తే, వయసులో ఉన్నప్పుడు బిచ్చమెందుకు ఎత్తుకున్నడు??’ అని హిందీలో రాసి ఉన్న ట్వీట్ యొక్క స్క్రీన్‌షాట్ లభించింది.

 @Kareena_Kpn1 అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ ట్వీట్ చేయబడింది. ఈ ట్విట్టర్ హ్యాండిల్ బయోలో  ‘#FANS_CLUB #FANS_PAGE’ అని ఉంది. కరీనా కపూర్ ఫ్యాన్ పేజీ ద్వారా చేసిన ఈ ట్వీటుని, కరీనా కపూర్ కి తప్పుగా వైరల్ పోస్టు ద్వారా ఆపాదిస్తున్నారు.

చివరిగా, ప్రధాని మోదీని ఎద్దేవ చేస్తూ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll