Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ మోటారు వెహికల్ రూల్స్ ప్రకారం బరువు చెకింగ్ కోసం వాహనం ఆపకపోతే రూ. 40 వేల జరిమానా విధించవచ్చు

0

వాహనంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బొమ్మ ఉందని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ వాహనానికి 42,600 రూపాయల ట్రాఫిక్ జరిమానా విధించారు, అంటూ రెండు ఫోటోలతో కూడిన ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ పోస్టులో జరిమానా విధించిన వాహనం ఫోటోని మరియు ట్రాఫిక్ జరిమాన రిసిప్ట్ యొక్క స్క్రీన్ షాట్‌ని షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యోక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వాహనంపై జనసేన పార్టి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బొమ్మ ఉందని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ వాహనానికి 42,600 రూపాయల ట్రాఫిక్ జరిమానా విధించారు.

ఫాక్ట్ (నిజం): పవన్ కళ్యాణ్ బొమ్మ అతికించిన వాహనానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు 42,600 రూపాయల జరిమానా విధించినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. ఓవర్ లోడ్ కారణంగా వాహనానికి 42,600 జరిమాన విధిస్తున్నట్టు ఈ ట్రాఫిక్ జరిమాన రసీదులో స్పష్టంగా తెలిపారు. భారత దేశ మోటార్ వాహనాల సవరణ చట్టం, 2019 ప్రకారం ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న వాహనానికి కనీసం 20,000 జరిమానా, పరిమితికి మించి ఉన్న బరువులోని ఒక్కో టాన్నుకి 2000 రూపాయిల జరిమాన విధించవచ్చని ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని 21 అక్టోబర్ 2020 నుండి అమలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం, ఒకవేళ వాహన డ్రైవర్ బరువు చెకింగ్‌కు కోసం ఆపక పారిపోవడానికి ప్రయత్నిస్తే ఆ వాహనంపై 40,000 రూపాయిల జరిమానా విధించవచ్చు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన సమాచారం కోసం గుగూల్‌లో వెతికితే, పవన్ కళ్యాణ్ బొమ్మ అతికించిన కారణం చేత ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక వాహనానికి 42,600 రూపాయల జరిమానా విధించినట్టు ఎవరూ రిపోర్ట్ చేయలేదని తెలిసింది. ఈ పోస్టులో షేర్ చేసిన రసీదులో, పట్టుబడిన వాహనం ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న కారణంగా జరిమానా విధిస్తున్నట్టు స్పష్టంగా తెలిపారు. ఈ వాహనాన్ని కాకినాడలోని అన్నమగటి జంక్షన్ దగ్గర పట్టుకున్నట్టు తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో తెలిపిన ట్రాఫిక్ జరిమానాకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా ఎడిషన్లలో రిపోర్ట్ చేసారా అని వెతికితే, ఈ ట్రాఫిక్ చలాన్ గురించి ఏ ఒక్క వార్తా పత్రిక రిపోర్ట్ చేయలేదని తెలిసింది.

భారత ప్రభుత్వం మోటార్ వాహనాల సవరణ చట్టం, 2019 ప్రకారం, ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న వాహనానికి కనీసం 20,000 జరిమానా, పరిమితికి మించి ఉన్న బరువులోని ఒక్కో టాన్నుకి 2000 రూపాయిల జరిమానా విధించవచ్చని ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని 21 అక్టోబర్ 2020 నాడు ఆమోదిస్తూ జీవో జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఒకవేళ డ్రైవర్ వాహనం బరువు చెకింగ్‌కు కోసం ఆపక పారిపోవడానికి ప్రయత్నిస్తే, ఆ వాహనంపై 40,000 రూపాయిల జరిమాన విధించవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన నూతన ట్రాఫిక్ నియమాల చట్టాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు వీడియోలని, ఆర్టికల్స్‌ని పబ్లిష్ చేసాయి. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఓవర్ లోడ్ కారణంగా దేశంలోని కొన్ని వాహనాలకి 2 లక్షలపై వరకు జరిమానా విధించారు. ఈ వివరాల ఆధారంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోటో అతికించినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు 42,600 రూపాయల జరిమాన విధించారనే ఆరోపణ పూర్తిగా నిరాధారమైనవని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ మోటారు వెహికల్ రూల్స్ ప్రకారం బరువు చెకింగ్ కోసం వాహనం ఆపకపోతే రూ. 40వేల జరిమానా విధించవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll