Fake News, Telugu
 

‘ఆంధ్ర ప్రదేశ్ సీఎం గా వై.ఎస్ జగన్ 30 సంవత్సరాలు ఉంటాడు’ అంటూ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్ వ్యాఖ్యలు చేయలేదు

1

‘దేశంలోనే జగన్ గొప్ప సీఎం.. ఆయన గొప్ప పరిపాలన చేస్తున్నాడు.. ఇంకా 30 సంవత్సరాలు ఏపీకి జగనే సీఎంగా ఉంటారు’ అని ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్ జగన్ పై ప్రశంసలు కురిపించారంటూ ఫేస్బుక్ లో చాలా మంది పోస్టు చేస్తున్నారు. మరికొంతమంది గవర్నర్ విశ్వ భూషణ్ అలా అన్నడానికి సంబంధించిన వీడియో అంటూ ఒక వీడియోని కూడా పోస్టు చేస్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్: ‘దేశంలోనే జగన్ గొప్ప సీఎం.. ఆయన గొప్ప పరిపాలన చేస్తున్నాడు.. ఇంకా 30 సంవత్సరాలు ఏపీకి జగనే సీఎంగా ఉంటారు’.

ఫాక్ట్ (నిజం): ఆంధ్ర ప్రదేశ్ సీఎం వై.ఎస్ జగన్ గురించి గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్ పోస్టులో చెప్పిన వ్యాఖలు చేసినట్లుగా వార్తాపత్రికలు కానీ, మీడియా కానీ ఎక్కడా కూడా ప్రచురించలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్ పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు చేశాడా అని తెలుసుకోవడానికి గూగుల్ లో ‘గవర్నర్ విశ్వ భూషణ్ దేశంలోనే గొప్ప సీఎం జగన్’ అనే కీవర్డ్స్ తో వెతికినప్పుడు, విశ్వ భూషణ్ అలా వ్యాఖ్యానించడానికి  సంబంధించిన ఎటువంటి సమాచారం కూడా సెర్చ్ రిజల్ట్స్ లో లభించలేదు.

గవర్నర్ విశ్వ భూషణ్ అలా అనడానికి సంబంధించిన వీడియో అంటూ ఫేస్బుక్ లో పోస్టు చేసిన వీడియో చూసినప్పుడు కూడా, అందులో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా లేదు. సమాచారం కోసం వెతికే ప్రక్రియలో యూట్యూబ్ లో కూడా అదే వీడియో పోస్టులోని చెప్పిన విషయాలతో కూడిన థంబ్ నేల్ తో ఉన్నట్లుగా తెలిసింది. కావున, వినియోగదారులను ఆకర్షించడానికి ఆ విధంగా అప్లోడ్ చేసి ఉంటారు. దీన్నే క్లిక్ బెయిట్ హెడ్ లైన్ అంటారు.

ఒక వేళ గవర్నర్ విశ్వ భూషణ్ నిజంగానే అటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే రాష్ట్రం లోని అన్ని ప్రముఖ వార్తా పత్రికలు  మరియు మీడియా సంస్థలు దాని గురించి ప్రచురించేవి. కానీ, అటువంటి న్యూస్ ఎవరూ కూడా రిపోర్ట్ చేయలేదు. కావున, సీఎం జగన్ గురించి గవర్నర్ విశ్వ భూషణ్ ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఎదో ఒక వీడియో పెట్టి తప్పుడు సమాచారం తో వైరల్ చేస్తున్నారు.

చివరగా, ఆంధ్ర ప్రదేశ్ సీఎం వై.ఎస్ జగన్ గురించి గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్ పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు చేయలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll